Ads
బుల్లితెర పై ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ మొదటి నుండి ప్రేక్షకాదరణతో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఈ సీరియల్ నటించిన వారంతా సహజమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కావ్య పాత్ర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ఈ సీరియల్ లో కావ్య పాత్రలో నటిస్తున్న నటి పేరు దీపికా రంగరాజు. తమిళ అమ్మాయి దీపిక కావ్యగా తెలుగువారికి చేరువైంది. ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బ్యూటీ, హెల్త్, పర్సనల్ వీడియోలను షేర్ చేసే చేస్తుంది. తాజాగా నెలసరి సమస్యతో ఇబ్బందీపడే మహిళల కోసం ఓ టిప్ ను షేర్ చేసింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
తెలుగు అమ్మాయిలా ఉండే దీపిక తమిళనాడులో పుట్టి పెరిగింది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన దీపిక, మోడల్‌గా పలు యాడ్స్ లో నటించింది.ఆ తరువాత తమిళ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, పలు సీరియల్స్ నటించి, తక్కువ కాలంలో పాపులర్ అయ్యింది. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగులో అడుగుపెట్టింది. బ్రహ్మముడితో పాపులర్ కావడంతో ఆమె యూట్యూబ్ ఛానల్ కు కూడా చాలా తక్కువ టైమ్ లోనే 87 వేలమంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
దీపిక తన యూట్యూబ్ ఛానల్ తో మంచి ఆదాయాన్ని పొందుతోంది. అందులో ఆమె అందం, ఆరోగ్యం, వంటి వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఎంతోమంది మహిళలు సతమతమయ్యే ఇర్రెగ్యులర్ పిరియాడ్స్ గురించి తన అనుభవాన్ని చెబుతూ దీపిక ఓ వీడియో షేర్ చేసింది. “స్కూల్ రోజుల నుండే తను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉండేదని, దాంతో ముఖం పై మొటిమలు వచ్చేవని తెలిపింది. అప్పుడు ఆమెను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళగా, డాక్టర్స్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అని అన్నారట. చాలా చికిత్స తీసుకున్నారు.
అప్పుడు ఆమె తండ్రి ఓ రెమిడీ చెప్పారట. అప్పటి నుండి ఆమె ఫీవర్ నట్ పొడిని తీసుకుంటున్నని చెప్పింది. ఇవి అన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఫీవర్ నట్స్ ని ఎండలో ఆరబెట్టి, పలగకొట్టి, నాట్స్ లోపల ఉండే పప్పుతీసి, పొడి చేసుకోవాలి. పావు టీస్పూన్ పొడిని నీటిలో కలుపుకుని తీసుకోవాలి. ఇలా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ, ఫేస్ పై పింపుల్స్ పోతాయి” అని బ్రహ్మముడి కావ్య చెప్పుకొచ్చారు.
Also Read: “నాకు మరో జన్మనిచ్చారు..!” అంటూ… “రేణు దేశాయ్” ఎమోషనల్ పోస్ట్..!ఏం అన్నారంటే..?