“బ్రహ్మముడి” అపర్ణ కూతురు ఆ హీరోయిన్ అని మీకు తెలుసా.? రీసెంట్ గా “జగపతి బాబు” సినిమాలో కూడా.?

Ads

బ్రహ్మముడి సీరియల్ లో హీరో రాజ్ తల్లిగా అపర్ణ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించే నటి అసలు పేరు శ్రీప్రియ. టీవీ ఇండస్ట్రీలో ఆమెకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ సీనియర్ నటి సీరియల్ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ప్రతిరోజు బ్రహ్మముడి, వైదేహి పరిణయం ఈ రెండు సీరియల్స్ లో ఆడియన్స్ కి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది శ్రీప్రియ.

brahmamudi serial sripriya daughter

బ్రహ్మముడిలో ఇష్టం లేని అమ్మాయిని కోడలుగా యాక్సెప్ట్ చేయలేని అత్తగా…ఆమె నటన సూపర్ గా ఉంటుంది. ఆమె తెలుగు బుల్లితెరకు మొగలిరేకులు టైం నుంచి పరిచయస్తురాలు. ఆమె గురించి తెలిసినంత బాగా చాలామందికి ఆమె కూతురు చరిష్మా శ్రీకర్ గురించి తెలియదు. శ్రీప్రియ కూతురు ఆల్రెడీ పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. నీతోనే హాయ్ హాయ్, ఆర్ యూ మ్యారీడ్ లాంటి చిత్రాలలో ఆమె తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది.

brahmamudi serial sripriya daughter

అంతేకాకుండా రీసెంట్ గా జగపతి బాబు, మమతా మోహన్ దాస్ కాంబినేషన్ లో వచ్చిన రుద్రాంగి చిత్రంలో కూడా ఆమె ఒక కీ రోల్ పోషించింది. ఇలా తల్లి ఒక పక్క సీరియల్స్ లో సత్తా చాటుతుంటే కూతురు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుంది. చరిష్మా సోషల్ మీడియాలో తన ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. మరోపక్క శ్రీప్రియ ఎన్నో వైవిధ్యమైన తల్లి పాత్రల్లో నటిస్తు మెప్పిస్తున్నారు. మొగలిరేకులు సీరియల్ సమయం నుంచి తల్లి పాత్రలకు బుల్లి కేరాఫ్ అడ్రస్ శ్రీప్రియ అని చెప్పవచ్చు.

 

Previous articleశ్రీకాంత్ తో రోజా ఈ సీన్ చేయడానికి 27 టేక్స్ పట్టింది అంట…ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు.!
Next articleపెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ కంటే ప్రేమ వివాహం చేసుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నారా.? కారణం ఇదేనా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.