Ads
కొన్ని సినిమాలలో వరుడు వధువు మెడలో తాళి కడుతుండగా ‘ఆపండి’ అంటూ ఓ అమ్మాయి లేదా విలన్ లేదా హీరో గట్టిగా అరవడం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయితే ఆ పెళ్లి ఆపింది ఎవరో కాదు. పెళ్లి కూతురే కావడంతో పెళ్లికొడుకు షాక్ అయ్యాడు.
కొందరు అమ్మాయిలు పెళ్లి కుదిరిన తరువాత పెళ్లి ఇష్టం లేదని, మరొక వ్యక్తిని లవ్ చేశానని చెబుతుంటారు. కానీ ఇక్కడ, సరిగ్గా తాళి కట్టబోయే ముందు వధువు తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో హోసదుర్గలోని చిక్కబ్యాలదకెరె అనే గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువకుడికి, ఐశ్వర్య అనే యువతితో ఇరువురి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాన్ని కుదుర్చారు. వీరి పెళ్లికి డిసెంబరు 7 (గురువారం )న ముహుర్తాన్ని కూడా నిర్ణయించారు. వివాహ వేడుక ను ఘనంగా జరిపించడం కోసం పెళ్లికుమారుడి కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేశారు.
చిక్కబ్యాలదకెరె గ్రామంలోని భైవవేశ్వర్ కళ్యాణమండపానికి ఇరు కుటుంబలు వరుడు, వధువులతో చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులతో పెళ్లి మండపం కోలాహలంగా మారింది. వరుడు తాళి కడితే పెళ్లి అయిపోయినట్టే. కానీ పెళ్లికుమార్తె ఐశ్వర్య ఆఖరి క్షణంలో సరిగ్గా వరుడు తాళి కట్టబోతుండగా పెళ్లికి నిరాకరించింది. పెళ్లి కూతురు ఐశ్వర్య ప్రవర్తనతో వరుడు షాక్ అయ్యాడు.
పెళ్లి కూతురును పెళ్ళికి ఒప్పించేందుకు తల్లిదండ్రులు, బంధువులు చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ యువతి ఒప్పుకోలేదు. పెళ్లి కూతురు అలా ప్రవర్తించడంతో పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు, బంధువులకు కోపం వచ్చింది. దాంతో రెండు కుటుంబాల మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది. ఈ గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. వివాహం క్యాన్సిల్ అయ్యింది. పెళ్లికి పెట్టిన ఖర్చులు పెళ్ళికుమార్తె ఫ్యామిలీనే భరించాలని చెప్పి, పోలీసులు రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Ads
watch video :
The Bride denied to get married during Maangalyadharane! She should’ve told before itself! 😑 pic.twitter.com/AG7gDRRHKq
— Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) December 8, 2023
Also Read: డాక్టర్ కి కూడా ఈ కష్టం తప్పలేదా..? సరిగ్గా పెళ్ళికి ముందు..?