Ads
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో షర్మిల వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని హస్తంలో కలిపారు.
అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అయితే అదే వేదిక పై వైఎస్ షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పన్నెండు ఏళ్ళ క్రితం అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన సమయంలో ఏపీలో జగన్ స్థాపించిన పార్టీని ముందుకు నడిపించడానికి వై ఎస్ షర్మిల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 ఏపీ ఎన్నికల ముందు వైయస్సార్సీపీ తరఫున ప్రచారం విస్తృతంగా చేశారు. 2021లో షర్మిల తెలంగాణలో జూలై 8న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని మొదలుపెట్టారు. తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు. తాజాగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపారు. ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఈ సందర్భంగా వేదిక పై ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వైఎస్ షర్మిలకు కుండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తరువాత ఆమెతో పాటు ఉన్న ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు కండువా కప్పబోయారు. ఈ విషయన్ని గమనించిన బ్రదర్ అనిల్, కండువా వేయవద్దని షర్మిలకు సైగ చేసారు. షర్మల కండువా వేయబోతున్న ఖర్గేతో ఆయనకు కండువా వద్దని నవ్వుతూ చెప్పారు. దాంతో ఖర్గే షాక్ అయ్యి, ఆ కండువాను పక్కన పెట్టసారు. ఈ సీన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
అయితే బ్రదర్ అనిల్ కుమార్ కండువా కప్పుకోకపోవడానికి ప్రత్యేక కారణం ఏమి లేదని షర్మిల సన్నిహితులు చెప్పారు. బ్రదర్ అనిల్ క్రిస్టియన్ సంస్థలలో పనిచేస్తున్నందున ముందుకు రాలేదని అన్నారు. ట్రూ క్రిస్టియన్లు ఎవరు ఒక పార్టీకి కట్టుబడి ఉండరని అన్నారు. అయితే షర్మిలతో పాటు, బ్రదర్ అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అందరు భావించగా, అలా జరుగకపోవడంతో అపోహలు వచ్చాయని షర్మిల అనుచరులలో ఒకరు వెల్లడించారు.
Ads
Also Read: MLA YASHASWINI REDDY HUSBAND: యశస్విని రెడ్డి భర్త ఎవరో తెలుసా..? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?