Ads
యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడైన రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం బబుల్ గుమ్. ఈ సినిమాలో హీరోయిన్ మానస చౌదరి. సుమ, రాజీవ్ ల కొడుకు కాబట్టి రోషన్ కు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది.
ఈ సినిమా ట్రైలర్, టీజర్, లవ్ సాంగ్స్ లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రేక్షకులకు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ బాగా హిట్ అయింది.
సుమ చేస్తున్న పలు టీవీ ప్రోగ్రాములలో కూడా తన కొడుకు రోషన్ ని పిలుస్తూ ఈ సినిమా గురించి అడ్వటైజ్ చేసుకొని వచ్చింది. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ లో ఏమాత్రం వెనకాడకుండా 6 కోట్లతో సినిమాను బాగానే తీశారు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 5 కోట్లు గ్రాస్, 8 కోట్ల షేర్ క్రాస్ అవ్వాలి. ఈ సినిమా భారత దేశంలో హీరో తొలిచిత్రానికి రికార్డ్ స్థాయిలో 500 స్క్రీన్లు అలాగే వరల్డ్ వైడ్ గా 750 స్క్రీన్లు వచ్చాయి. సినిమా టాక్ విషయానికొస్తే కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది.
Ads
కనుక కలెక్షన్ల మీద ఈ ప్రభావం పడవచ్చు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే ఉంది. సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య అయిన తేజ జొన్నలగడ్డ వంటి నటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి కామెడీ అండ్ లవ్ స్టోరీ మిక్స్ లో వస్తుంది. మొదటిరోజు మార్నింగ్ షో కి 25% ఆక్యుపెన్సివ్, మ్యాట్నీకి 25% ఆక్యుపెన్సివ్ , ఈవినింగ్ షో కి 25% ఆకీపేన్సివ్, సెకండ్ షో కి కూడా 25% ఆక్సిపెన్సివ్ వచ్చింది. హైదరాబాదులో కూడా 25% ఆకీపెన్సివ్ కన్నా ఎక్కువ లేదు.
మొదటి రోజు కోటి రూపాయల గ్రాస్ దాటింది ఈ సినిమా. హీరో, హీరోయిన్ల పెయిర్ అండ్ కెమిస్ట్రీకి కొంచెం పాపులారిటీ వస్తే ప్రేక్షకులు థియేటర్లు మీద పడతారు. అప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు లాగించగలదో చూడాలి. సినిమా విషయానికొస్తే అంతంతమాత్రంగానే ఉన్నా కొన్ని చోట్ల జోకులు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. పాటలు కూడా పర్లేదు అన్నట్టుగానే ఉన్నాయి. మరి బాక్సాఫీస్ లో ఈ సినిమా కలెక్షన్ల ప్రకారం హిట్ అవుతుందో లేదో చూడాలంటే ఈ వారం థియేటర్ ఆక్యుపెన్సివ్ మీద ఆధారపడి ఉంది.