Ads
హిందువుల దశాబ్దాల కల అయిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) నాడు అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ నిర్మాణానికి రామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్టు భక్తులను విరాళాలు కోరింది. ఈ అద్భుతమైన రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు ఇచ్చారు.
ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం రామమందిర నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన వారిలో ఉన్నారు. సూరత్‌కు చెందిన దిలీప్ కుమార్ అనే వజ్రాల వ్యాపారి అయోధ్య రాముడికి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చారు అంట. ఆ బంగారంతో రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, ఢమరుకం, పిల్లర్లు చేయించడానికి కేటాయించారు అంట.
Ads
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం, బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలనుండి 7000 మంది విశిష్ట అతిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలామంది ప్రముఖులు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి అయోధ్య వెళ్లారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలుపంచుకున్నారు