Ads
ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మన బుర్రకి మన కంటికి పరీక్ష పెడుతుంది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చూపించడమే ఆప్టికల్ ఇల్యుషన్ స్పెషాలిటీ. ఇది పురాతన కాలం నుంచి ఇవి వాడుకలో ఉంది. వీటి పుట్టుక గ్రీకు దేశంతో సంబంధం ఉన్నట్టు చెబుతారు. అక్కడి పురాతన కళల్లో ఆప్టికల్ ఇల్యూషన్లను ఒక భాగంగా గుర్తించారు. ఇప్పటికీ పురాణ గ్రీకు వాస్తు శిల్పాల్లో అక్కడ ఆప్టికల్ ఇల్యుషన్లు దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరించింది మొదట గ్రీకులే అని చెబుతారు చరిత్రకారులు. ఆప్టికల్ ఇల్యూషన్లు అనేవి కాంతి వక్రీభవనం వల్ల ఏర్పడే వింతలు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎంతోమంది ఆర్టికల్ ఇల్యుషన్లను చిత్రీకరించే చిత్రకారులు పుట్టుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వీటిని చిత్రించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Ads
ఆప్టికల్ ఇల్యుషన్లో అక్షర భ్రమలు, బొమ్మల భ్రమలు అని రెండు రకాలు ఉంటాయి. అక్షర భ్రమలు అంటే ఒకే రకమైన అక్షరాలలో వేరే అక్షరం ఇరుక్కుని ఉంటుంది.అలాగే బొమ్మల భ్రమలు అంటే ఒకే రకమైన బొమ్మల మధ్యలో వేరే రకం బొమ్మ ఇరుక్కుని ఉంటే దాన్ని తక్కువ సమయంలోనే కనిపెట్టాలి. ఇక్కడ ఒక అక్షరాల ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చారు. ఇందులో ఆంగ్ల అక్షరం M ఉంది. వాటి మధ్యలో ఇంకో ఆంగ్ల అక్షరం W ఇరుక్కొని ఉంది. దాన్ని మీరు కేవలం ఐదు సెకండ్లలోనే కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెడతారు. ఐదు సెకండ్లలో కనిపెడితే మీ మెదడు, కళ్ళు చురుగ్గా పనిచేస్తున్నట్టే లెక్క ప్రయత్నించండి.
మీరు చాలా సేపు ప్రయత్నించే ఉండి ఉంటారు. చాలామందికి ఆన్సర్ దొరికేసి ఉంటుంది ఆన్సర్ దొరకని వారికోసం మేము ఇక్కడ ఆన్సర్ అందిస్తున్నాం.ఇక్కడ అన్ని లైన్లలో M అనే అక్షరం ఉంది. మూడో లైన్ లోని మధ్యలో W అనే అక్షరం ఉంది. జాగ్రత్తగా చూస్తే మీరు దాన్ని కనిపెట్టగలరు. దీన్ని ఐదు సెకండ్లలోనే కనిపెట్టి ఉంటే మీ కళ్ళు, మెదడు మంచి పనితీరు కనబరిస్తున్నట్టే లెక్క.