Ads
మనిషి ఏది లేకుండా అయినా బతకగలరెమో కానీ …తిండి, నిద్ర లేకపోతే సంతోషకరమైన జీవితం గడపడం అనేది అసాధ్యం. ఈ రెండిటిలో కూడా తిండి మితంగా తీసుకున్న సరిపోతుందేమో కానీ నిద్ర మాత్రం తగినంత లేకపోతే ఇక మన పరిస్థితి అంతే. ఒక్కరోజు నిద్ర తక్కువైనా ఆ రోజంతా ఏదోగా ఉండడం మనము గమనించే విషయమే. కాగా మంచిగా నిద్రపోయే సమయం ఉన్నా కానీ.. నిద్రపోయినప్పుడు చెమటలు పడితే మాత్రం ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు వైద్య నిపుణులు.
మనం నిద్ర పోయినప్పుడు ఒకవేళ వేడిగా ఉంటే చెమటలు పట్టడం సాధారణమే. అలాకాకుండా ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు కూడా అలానే చలికాలంలో కూడా.. మనం నిద్రపోయి లేవగానే బట్టలు మొత్తం తడిచినట్టు చెమటలు పడితే మాత్రం అది తప్పక జాగ్రత్త తీసుకోవలసిన విషయం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేదానికి కారణాలు ఒకసారి చూద్దాం…
కొన్ని మందులు: కొన్ని రకాల మందులు.. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణం
అవుతాయి.
ఒత్తిడి : మనిషి చాలా అదుపులో పెట్టుకోవలసిన విషయాలు ..ఆందోళన ఒత్తిడి. ఈ రెండు కూడా రాత్రి చెమట పట్టడానికి కారణం కావచ్చు.
Ads
థైరాయిడ్ : థైరాయిడ్ అనేది హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంధి. ఈ హార్మోన్లు అనేక విధులను నియంత్రిస్తాయి. థైరాయిడ్ విధుల్లో ఒకటి శరీర నిర్మాణాన్ని నియంత్రించడం. కాగా ఈ థైరాయిడ్ ఉత్పత్తి అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, శరీర స్థాయి పెరిగి, దానివల్ల మన శరీరం పైన ఎక్కువ చెమట పట్టేలా చేస్తుంది.
సంక్రమణ: శరీరం సంక్రమణతో పోరాడినప్పుడు.. అది దాని తీవ్రతను పెంచుతుంది.. ఇక దీనివల్ల కూడా రాత్రిపూట ఎక్కువగా చమట పట్టొచ్చు.
ఇన్ఫెక్షన్స్ : ఏమన్నా కొన్ని సాధారణ వ్యాధులు జ్వరం, ఫ్లూ, సిఫిలిస్, HIV.. లాంటివి కూడా రాత్రి నిద్ర పోయినప్పుడు మనకి చమట వచ్చేలా చేస్తాయి
క్యాన్సర్: కొన్ని రకాల క్యాన్సర్లు (లింఫోమా, లుకేమియా) తో మనిషి సఫర్ అవుతున్నా కానీ అది రాత్రి చెమట పట్టేలా చేస్తుంది.
మొత్తానికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు చల్లగా ఉన్న చెమటలు పడుతుంటే మాత్రం తక్షణం ఆ విషయాన్ని గమనించి డాక్టర్ ని సంప్రదించడం తప్పనిసరి.