Ads
చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ల పేర్లు ని మార్చుకున్నారు అసలు పేర్లు ఒకటైతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మరొక పేరుతో పాపులర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు ప్రభాస్ దాకా చాలా మంది ఒరిజినల్ పేర్లు వేరు.
కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. మరి ఇక వాళ్ళ అసలు పేర్లు ఏంటో చూద్దాం. చాలా మందికి ఈ స్టార్స్ అసలు పేర్లు తెలియదు మరి సెలబ్రిటీలు అసలు పేర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.మెగాస్టార్ చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదల శివశంకర వరప్రసాద్ కానీ మెగాస్టార్ చిరంజీవిగా పాపులర్ అయిపోయారు. ఎన్నో సినిమాల్లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరంజీవి.
2. నాని:
నాని అసలు పేరు నాని కాదు నవీన్ బాబు గంటా. ఇండస్ట్రీ లోకి వచ్చాక నవీన్ బాబు కాస్త నాని గా మారింది.
3. కీరవాణి:
కీరవాణి అసలు పేరు కీరవాణి కాదు కోడూరి మరకతమణి కీరవాణి.
4. రవితేజ:
రవితేజ అసలు పేరు వచ్చేసి భూపతి రాజు రవిశంకర్ రాజు. కానీ మనకి మాస్ మహారాజ్ రవితేజ లాగే తెలుసు. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు.
5. పవన్ కళ్యాణ్:
కొణిదెల కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ అసలు పేరు కానీ మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా తెలుసు.
6. జగపతిబాబు:
ఈయన అసలు పేరు కూడా జగపతిబాబు కాదు జగపతిబాబు అసలు పేరు వీరమాచినేని జగపతిరావు.
7.రాజమౌళి:
దర్శక ధీరుడు రాజమౌళి అసలు పేరు రాజమౌళి కాదు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.
8. త్రివిక్రమ్ శ్రీనివాస్:
త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాసు శర్మ. త్రివిక్రమ్ శ్రీనివాస్ గా మాత్రమే మనకి తెలుసు.
9. ప్రభాస్:
వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి ప్రభాస్ అసలు పేరు కానీ ప్రభాస్ గా మనకి సుపరిచితం.
10. కృష్ణవంశీ:
కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగారు రాజు కానీ కృష్ణవంశీగా పాపులర్ అయిపోయారు.
11. మణిరత్నం:
మణిరత్నం అసలు పేరు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం కానీ మణిరత్నంగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను మణిరత్నం తీసుకొచ్చారు.
12. రంభ:
రంభ అసలు పేరు విజయలక్ష్మి కానీ మనకి రంభగానే మనకి తెలుసు చాలామంది హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది.
13. మమ్ముట్టి:
మమ్ముట్టి అసలు పేరు కూడా మమ్ముట్టి కాదు. మొహమ్మద్ కుట్టి పనిపరంబిల్ ఇస్మయిల్ కానీ మమ్ముట్టి అసలు పేరు ఇదే అని ఎవరికీ తెలీదు, మమ్ముట్టి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
14. సౌందర్య:
సౌందర్య అప్పట్లో చాలామంది టాప్ హీరోల సరసన నటించింది. సౌందర్య అసలు పేరు సౌందర్య అని చాలా మంది అనుకుంటారు కానీ ఆమె అసలు పేరు సౌమ్య. ఇండస్ట్రీలో ఆమె సౌందర్య గా ప్రసిద్ధి చెందింది.
15. రజినీకాంత్ :
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి అందర్నీ ఆకట్టుకున్నారు రజినీకాంత్. శివాజీ రావు గైక్వాడ్ రజనీకాంత్ అసలు పేరు కానీ రజనీకాంత్ గా సినిమాల్లోకి వచ్చి ఫేమస్ అయిపోయారు.
16. నయనతార:
లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకుంది తమిళ సినిమాలో తెలుగు సినిమాలు కూడా చేసి అందరినీ ఫిదా చేసేసింది నయన్. ఈమె అసలు పేరు డయానా మరియం కురియన్.
17. రోజా:
రోజా మొదట సినిమాల్లో నటించారు తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లారు అలానే బుల్లితెర మీద షోలలో కూడా రోజా సందడి చేస్తుంది. రోజా అసలు పేరు రోజా కాదు ఆమె అసలు పేరు శ్రీలత రెడ్డి కానీ రోజా గా ఆమె ఫేమస్ అయ్యారు.
18. సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు కృష్ణ కాదు ఘట్టమనేని శివరామకృష్ణ కానీ మనకి కృష్ణగా మాత్రమే తెలుసు అసలు పేరు చాలామందికి తెలియదు.
19. శ్రీదేవి:
శ్రీదేవి తన అంతం తో అభినయంతో అందరినీ కట్టిపడేశారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యంగర్ అయ్యప్పన్. కానీ అందరికీ శ్రీదేవి గానే తెలుసు.
Ads
20. ఆర్య:
ఆర్య కూడా తన అసలు పేరుతో ఇండస్ట్రీ లోకి రాలేదు. జంషద్ సేతిరకత్ ఆయన అసలు పేరు. కానీ మనకి తెలియదు ఆర్యగానే మనకి తెలుసు.
21.జయప్రద:
అప్పటి హీరోయిన్ జయప్రద తెలియని వాళ్ళు ఉండరు. ఈతరం వాళ్లకు కూడా జయప్రద తెలుసు. అయితే జయప్రద గురించి తెలియని విషయం ఏమిటంటే ఆమె అసలు పేరు జయప్రద కాదు ఆమె అసలు పేరు లలితా రాణి.
22. ధనుష్:
ధనుష్ అటు తమిళ్ లో ఇటు తెలుగులో కూడా కనబడుతూ ఉంటాడు ధనుష్ అసలు ధనుష్ కాదు వెంకటేష్ ప్రభు. ధనుష్ గా మాత్రమే మనందరికీ తెలుసు.
23. సత్యరాజ్:
బాహుబలి లో కట్టప్ప గా నటించి సత్యరాజ్ మంచి మార్కులు కొట్టేశాడు. అలానే చాలా సినిమాలు చేసాడు. రంగరాజు ఆయన అసలు పేరు.
24. స్నేహ:
స్నేహ చాలామంది టాప్ హీరోలతో నటించారు. సుహాసిని రాజా రత్నం నాయుడు ఆమె అసలు పేరు. కానీ స్నేహగా ఇండస్ట్రీలోకి వచ్చి పాపులర్ అయింది.
25. మీరా జాస్మిన్:
మీరాజాస్మిన్ కూడా టాప్ హీరోల పక్కన నటించింది. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్ కానీ మీరా జాస్మిన్ గా మనందరికీ పరిచయం అయింది.
26. కియారా అద్వానీ:
కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ ఈమె చాలా సినిమాలు ఇప్పటికే నటించారు. ఈమె అసలు పేరు అలియా అద్వానీ అని చాలా మందికి తెలియదు.
27. అనుష్క శెట్టి:
లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఈమె కేరాఫ్ అడ్రెస్. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాస్తా అనుష్క గా మారింది.
28. రేవతి:
రేవతి అసలు పేరు ఆశా కుట్టి కానీ ఇండస్ట్రీలోకి వచ్చి ఈమె రేవతిగా పేరు మార్చుకుంది. అలానే అందరికీ తెలుసు.
29. ఏఆర్ రెహమాన్:
ఏఆర్ రెహమాన్ గురించి తెలియని వారు ఉండరు ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ కానీ రెహమాన్ గా మాత్రమే మనకి తెలుసు.
30. కమల్ హాసన్:
కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. కమల్ హాసన్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తెలుగు లో కూడా ఆయన చాలా సినిమాలు చేసారు.
31. జయసుధ:
ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన తర్వాత హీరో హీరోయిన్ల కి తల్లిగా నటిస్తూ ఇప్పుడు అందరినీ మెప్పిస్తున్నారు జయసుధ. చాలామంది సీనియర్ నటులతో ఈమె పని చేశారు. జయసుధ అసలు పేరు సుజాత నిడదవోలు కానీ జయసుధ గా ఇండస్ట్రీలో పాపులర్ అయిపోయారు.
32. టబు:
టబు కూడా చాలా మంది పెద్ద హీరోలతో పని చేశారు. టబు అసలు పేరు టబు కాదు. ఈమె అసలు పేరు టబ్సుమ హష్మీ ఖాన్.
33. విక్రమ్:
విక్రమ్ అసలు పేరు కెనడీ జాన్ విక్టర్. విక్రమ్ కూడా చాలా గొప్ప నటుడు. ఎన్నో సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు. ఆయన అసలు పేరు విక్రమ్ అని చాలా మంది అనుకుంటారు కానీ ఈ పేరు ఉందని ఎవరికీ తెలియదు.
34. జీవా:
జీవా అసలు పేరు అమర్ కానీ అమర్ పేరు ఎవరికీ తెలీదు. అంతా జీవా అని అనుకుంటుంటారు. జీవా కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసాడు.
35. యష్:
నవీన్ కుమార్ గౌడ్ అసలు పేరు కానీ యష్ గా మనకి తెలుసు. కేజీఎఫ్ సినిమా తో యష్ బాగా
పాపులర్ అయిపోయాడు.
36. విజయ్:
విజయ్ ఒరిజినల్ పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కానీ విజయ్ గా ఇండస్ట్రీ లోకి వచ్చాడు. అలానే పాపులర్ అయ్యాడు.
37. భూమిక చావ్లా:
భూమిక చావ్లా అసలు పేరు రచనా చావ్లా. కానీ భూమిక చావ్లాగా ఇండస్ట్రీ కి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించింది.
38. సిల్క్ స్మిత:
ఈమె అసలు పేరు విజయ లక్ష్మి. కానీ సిల్క్ స్మితగా పరిచయం అయింది. అప్పట్లో సిల్క్ స్మిత పేరు చెప్తే కుర్రకారుకి పిచ్చి ఎక్కిపోయేది.
39. నగ్మా:
నందిత అరవింద్ మొరార్జీ ఈమె అసలు పేరు కానీ నగ్మాగా ఈమె ఇండస్ట్రీలో స్థిరపడింది. టాప్ హీరోల పక్కన నటించింది.
40. సూర్య:
సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్. శరవణన్ శివ కుమార్ అని చాలా మందికి తెలీదు. ఇటు తెలుగు లో అటు తమిళ్ లో కూడా సూర్య ఫేమస్ అయ్యిపోయాడు.