Ads
సాధారణంగా తండ్రి మరణించినపుడు కొడుకు తలకొరివి పెడతారు. కానీ అలాంటి కుమారుడు తండ్రి జీవించి ఉండగానే కన్నుమూయడం అనేది చాలా విషాదకరమైన విషయం. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తన కళ్ళముందే చనిపోతే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం.
Ads
ఆ తండ్రి తాను జీవించి ఉన్నన్ని రోజులు ఆ బాధతోనే బ్రతకాల్సి వస్తుంది. అయితే అలాంటి పుత్రశోకం తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కొంతమందికి తప్పలేదు. ఆ తండ్రులు ఇప్పటికీ కొడుకులను తలుచుకుంటు బ్రతుకుతున్నారు. మరి టాలీవుడ్ లో కొడుకులను కోల్పోయిన ఆ తండ్రులు ఎవరో చూద్దాం..సూపర్ స్టార్ కృష్ణ:
గత ఏడాది మొదట్లోనే కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అనారోగ్యంతో కన్ను మూశారు. రమేష్ బాబు మరణం కృష్ణను శోకంలోకి నెట్టింది. అదే ఏడాదిలోనే సెప్టెంబర్ లో భార్య ఇందిరాదేవి మరణించగా, నవంబర్ లో సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు.
నందమూరి హరికృష్ణ
నటుడు నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ ఒక యాక్సిడెంట్ మరణించారు. కొడుకు మరణంతో హరికృష్ణ తీవ్రంగా కలత చెందారు. అయితే అది జరిగిన కొన్ని రోజులకే హరికృష్ణ కూడా యాక్సిడెంట్ మరణించారు.కోట శ్రీనివాసరావు:
నటుడు కోట శ్రీనివాసరావు ఒక్కగానొక్క కొడుకు కోట ప్రసాద్ యాక్సిడెంట్ లో మరణించారు. కోట ప్రసాద్ తలుచుకుని ఇప్పటికీ కోట శ్రీనివాసరావు బాధపడుతూనే ఉన్నారు.
బాబు మోహన్:
కమెడియన్ బాబు మోహన్ కొడుకు పవన్ కుమార్ కూడా ప్రమాదంలో చనిపోయాడు. బాబు మోహన్ ఇప్పటికీ కొడుకును గుర్తుచేసుకుంటూ బాధపడుతూనే ఉన్నారు.దర్శకుడు తేజ:
డైరెక్టర్ తేజ కొడుకు ఆరు సంవత్సరాల వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. తేజ తన కొడుకిని బ్రతికించుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు చేశాడు.అయిన ఫలితం లేకపోయింది. ఆ డిప్రెషన్ తోనే ఆయన కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు.ప్రకాష్ రాజ్:
యకరత ప్రకాష్ రాజ్ ఫస్ట్ భార్య కుమారుడు చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ చాలా బాధపడ్డాడు.
ప్రభుదేవా:
ప్రభుదేవాకు కుమారుడు కూడా చిన్న ఏజ్ లోనే మరణించాడు. కొడుకు చనిపోయిన అనంతరం భార్యతో గొడవలు జరిగి ప్రభుదేవా ఆమెతో విడిపోయాడు.Also Read: వేదం మూవీలో ‘కర్పూరం’ క్యారెక్టర్ చేసింది ఎవరో తెలుసా?