Ads
అయోధ్యలో శ్రీరాముని మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం మరో మూడు రోజుల్లో అత్యంత వైభవంగా జరగనుంది. జనవరి 22న తారీకున జరిగే ఈ కార్యక్రమానికి రామ మందిరం నిర్మాణ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
దేశ నలమూలల నుండి 7000 మంది విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రామమందిర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు అన్ని ఒకేరోజు జరగనున్నాయి.
అయితే మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది.జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల వరకు కేంద్ర ప్రభుత్వం ఆఫీసులు అన్నిటికీ సెలవు ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. భక్తులు మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమంలో అందరూ పాల్గొనందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పింది.
Ads
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరోజు సెలవును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోజు అధికారికంగా సెలవు ప్రకటించాలని రామభక్తులు పలువురు రాజకీయ నాయకులు కూడా కోరుతున్నారు. అయితే ఇప్పటికి దీనిపైన ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల్లోనే సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా హాజరవుతున్నట్లు ప్రకటించారు. బాహుబలి ప్రభాస్ 50 కోట్లు ఖర్చుపెట్టి ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చింది. భారతీయ అందరి ఆకాంక్ష నెరవేరన్న సందర్భంగా ఆరోజు దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొననుంది.