Ads
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ఫైనల్స్ మాట దేవుడెరుగు సెమిస్ కి చేరుతుందా లేదా అన్న స్థాయికి పాక్ ప్లేయర్స్ పర్ఫామెన్స్ పడిపోయింది. వరుసగా ఓటమి ఎదురు కావడంతో.. ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తుంది. మొదటి మ్యాచ్లలో వరుస విజయాలతో విజృంభించి టోర్నమెంట్లో శుభారంభం చేసి తన సత్తా చాటిన పాక్ టీమ్ ఇప్పుడు నీరసపడిపోతుంది.
వరుస విక్టరీలతో దూసుకుపోతున్న పాక్..దాయాది ఇండియన్ టీం చేతిలో ఓడిపోవడం ఎప్పుడైతే మొదలైందో ఇక వరస ఓటములు కామన్ అయిపోయాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీం ఇండియా హిస్టరీ రిపీట్ చేస్తూ పాక్ జట్టు ను 8వ సారి ముచ్చటగా మట్టి కరిపించింది.ఇక ఆ మ్యాచ్ తర్వాత నుంచి పాక్ కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి.
Ads
బెంగుళూర్ లో కంగారూల చేతిలో 62 పరుగుల తేడాతో ఓడింది బాబర్ టీం. ఎన్నడూ లేనిది ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ ముందు కూడా పాక్ జట్టు తలవంచింది. సెమీస్ కోసం కంపల్సరిగా గెలవాలి అన్న ఆటలో కూడ సఫారీల చేతిలో ఓడిపోయింది. వరల్డ్‌కప్‌లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. అంతేకాక వరల్డ్ కప్ లో పాక్ వరసగా నాలుగు మ్యాచులు ఓడిపోవడం ఇదే మొదటిసారి అంట. అయినా ఇంకా సెమిస్ లో పాల్గొని అవకాశం పాక్ కు మిగిలే ఉంది. ఎందుకంటే ఇంకా టోర్నమెంట్లో పాకిస్తాన్ మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
ఈ మూడు మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచి 10 పాయింట్లు సాధించగలిగితే ఎంతో కొంత సెమిస్ లో అడుగుపెట్టే అవకాశం మిగిలి ఉంటుంది. అది కూడా మిగిలిన టీమ్స్ పర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇంతకీ పాక్ సెమీస్ వరకు వెళ్తుందో లేదో చూడాలి.