Ads
ఏదైనా ఒక వస్తువు ప్రజల్లోకి వెళ్లాలి అంటే దానికి పబ్లిసిటీ అనేది చాలా అవసరం. పబ్లిసిటీ ఎంత బాగుంటే ప్రేక్షకులకి ఆ వస్తువు కానీ, లేదా వారు చెప్పాలనుకున్న పాయింట్ కానీ తొందరగా అర్థం అవుతుంది. అందుకే ఇప్పుడు చాలా సంస్థలు కూడా టీవీల ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాయి.
వారి గురించి చాలా మందికి తెలుసు. అయినా కూడా పబ్లిసిటీ వల్ల ప్రేక్షకులకు ఇంకా దగ్గర అవుతున్నారు. చాలా మంది ఎంతో మంది సెలబ్రిటీలని బ్రాండ్ అంబాసిడర్లుగా చేసి వారి వస్తువులను ప్రమోట్ చేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం వారే రంగంలోకి దిగి వారు తమ ఉత్పత్తులని ప్రమోట్ చేస్తున్నారు.
లలిత జ్యువెలరీస్ ఓనర్ అయిన కిరణ్ కుమార్ గారు తమ నగల గురించి ఆయనే చెప్తూ ఉంటారు. వారు నగలు ఎలా తయారు చేస్తారు అని, వారి దగ్గర ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అని వివరంగా చెప్తారు. లెజెండ్ సినిమాతో హీరోగా కూడా అడుగుపెట్టిన లెజెండ్ శరవణన్ కూడా శరవణ స్టోర్స్ ఓనర్ అనే సంగతి తెలిసిందే. ఆయన కూడా వారి వ్యాపారాలని తనే ప్రమోట్ చేసుకున్నారు. ఇంకా ఎంతో మంది తమ ఉత్పత్తులని తమే ప్రమోట్ చేసుకుంటున్నారు.
Ads
ఇటీవల అలా తన కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నారు ఒక వ్యక్తి. ఆయనే చంద్ర చంద్రశేఖర్ గారు. ఈయన స్వర్గసీమ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇటీవల స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మ్స్ కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే టీవీలో డిఫరెంట్ గెటప్స్ లో అడ్వర్టైజ్మెంట్ లో తమ శాండల్ వుడ్ ఫార్మ్స్ వివరాలు చెబుతూ కనిపిస్తున్నారు చంద్ర చంద్రశేఖర్ గారు.
చంద్ర చంద్రశేఖర్ గారు వ్యాపారవేత్త మాత్రమే కాదు. మంచి కౌన్సిలర్ కూడా. చంద్ర చంద్రశేఖర్ గారు వ్యక్తిత్వ వికాసానికి చెందిన ఎన్నో విషయాలని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తూ ఉంటారు. మనల్ని మనం మెరుగు పరుచుకోవడం ఎలా? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటివన్నీ చెప్పడంతో పాటు రిలేషన్ షిప్స్, వ్యాపారాలకి సంబంధించిన విషయాల మీద కూడా ఎన్నో వీడియోలు చేశారు. ఒక పక్క వ్యాపారంలో రాణిస్తూనే, మరొక పక్క కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. యూట్యూబ్ లో ఇలాంటి ఎన్నో వీడియోలని చంద్ర చంద్రశేఖర్ గారు షేర్ చేశారు.
watch video :
ALSO READ : ఉద్యోగం చేయడమా..? ఇంట్లో ఉండడమా..? ఈ కాలం ఆడవాళ్లు ఎక్కువగా ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే..?