ఎలాంటి చెడు అలవాట్లు లేవు…కానీ రూ.100 కోట్ల ఆస్తిని “చంద్రమోహన్” ఎలా పోగొట్టుకున్నారు.?

Ads

ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న కన్నుమూసిన విషయం తెలిసిందే. 78 సంవత్సరాల చంద్రమోహన్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. సోమవారం నాడు ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో చంద్రమోహన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు సినీపరిశ్రమలో ఉన్న విలక్షణ నటుల్లో చంద్రమోహన్ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్‌గా ఎన్నో పాత్రల్లో మెప్పించిన నటుడు చంద్రమోహన్. ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరో మరియు హీరోయిన్లకు అన్నయ్య పాత్రలలో, తండ్రి, బాబాయి, మామయ్య వంటి పాత్రలలలో నటించి  రాణించారు. చంద్రమోహన్ పేరుకు ముందు ఎలాంటి బిరుదు లేదా స్టార్ లేనప్పటికీ, ఆయనతో నటించిన కథానాయకలు స్టార్ హీరోయిన్లుగా మారారు.
రంగులరాట్నం అనే మూవీతో 1966 లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చంద్రమోహన్ టాలీవుడ్ లో ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. హీరోగా 175 పైగా సినిమాలలో నటించిన చంద్రమోహన్ మొత్తం 932 చిత్రాలలో నటించాడు. అలాంటి నటుడు పెద్దగా ఆస్తులు లేవని, ఒక టైమ్ లో తన ఆస్తిని పోగొట్టుకున్నట్టు చెప్పిన చంద్రమోహన్ పాత ఇంటర్వ్యూ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. చంద్రమోహన్ మాట్లాడుతూ, కెరీర్‌ మంచి స్థితిలో ఉన్న సమయంలో సినిమాలలో నటిస్తూ, వచ్చిన డబ్బుతో భారీగా ల్యాండ్ ను కొనుగోలు చేశానని తెలిపారు.
హైద్రాబాద్‌ కొంపల్లిలో ప్రముఖ నటుడు మరియు రచయిత గొల్లపూడి మారుతీ రావు దగ్గర సుమారు 35 ఎకరాల ద్రాక్ష తోటను కొనుగోలు చేశారట. 6 ఎకరాలు శంశాబాద్‌ మెయిన్ రోడ్డు పక్కన కొన్నారట. అంతేకాకుండా తమిళనాడు, చెన్నైలో కూడా సుమారు15 ఎకరాల భూమిని కొన్నారట. అయితే ఆ సమయంలో సినిమాలతో బిజీగా ఉండడం వల్ల, ఆ భూములను చూసుకునే సమయం లేకపోవడంతో చాలా తక్కువ ధరకు ఆ భూములను అమ్మేశారట. స్నేహితుడు హీరో శోభన్ బాబు ఎంతగా చెప్పినప్పటికీ, వినకుండా భూములను అమ్మేసారట. అలా చేయడం వల్ల సుమారు వంద కోట్ల వరకు నష్టపోయానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.

Ads

Also Read: “చిరంజీవి” కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న “చంద్రమోహన్”…ఏ సినిమాకి తెలుసా.?

 

 

Previous articleఏడాదిన్నర కాలంలో 37 మంది మృతి..హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలకు కారణం ఇదేనా.?
Next articleఅంత స్టార్ హీరో అయ్యుండి.. “వెంకటేష్” ఇలాంటి ఫోన్ వాడుతున్నారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.