Ads
న్యాయస్థానంలో ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బ తగులుతున్నా పిటిషన్ తర్వాత పిటిషన్ తోసి పుచ్చుతున్నా వరుస పెట్టి పిటిషన్లు పెడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు అండ్ కో. ఎంతకీ తేలని ఈ సమరంలో ఆఖరికి చంద్రబాబు తరుపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. న్యాయం మాట పక్కన పెడితే అసలు తమ మొర కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే బాధతో సిఐడి తరఫున ఆయవాదులపై కాస్త దురుసుగా కూడా ప్రవర్తించారు.
ఈరోజు కోర్టులో ఏసీబీ వద్ద ఉన్నటువంటి కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు తమ దగ్గర ఉన్నటువంటి కాల్ డేటా ఇవ్వాలంటూ టిడిపి వర్గాలు పిటిషన్ దాఖలు చేశాయి. పిటీషన్ వేసి ఇప్పటికీ నెల రోజులు గడుస్తున్న ఎటువంటి స్పందన లేదు అని చంద్రబాబు తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించారు. అయితే అసలు పిటిషన్ వేయడానికి వాళ్లకు అర్హత లేదంటూ సిఐడి న్యాయవాది వివేకానంద స్పష్టం చేశారు.
Ads
అయితే ఈ నేపథ్యంలో ఇరుపక్షాల లాయర్లకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారు అంటూ లక్ష్మీనారాయణ జడ్జిని ప్రశ్నించడం జరిగింది. అయితే లక్ష్మీనారాయణ తీరుపై సిఐడి తరఫున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో కాసేపు కోర్టు మొత్తం ఇరువైపులా లాయర్ల అరుపులతో దద్దరిల్లిపోయింది.
ఎంతసేపటికి ఎవరు తగ్గకపోవడంతో ఇరుపక్షాల లాయర్లపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లక్ష్మీనారాయణ ,నాగరాజు అనే లాయర్లు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ లో ఉన్నారా అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు దానికి లేదు అనే సమాధానం ఇచ్చారు. ఇటువంటివి తిరిగి చేయకూడదు అని ఆదేశించిన జడ్జి అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ లో ఉన్నవారు తప్ప మిగిలిన వారు బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ…ఈ విధంగా ఉంటే విచారించలేను అని బెంచి దిగి వెళ్లిపోయారు. మొత్తానికి ఈరోజు కూడా ఎటు తేల్చకుండా హైడ్రామా జరిపించారు.