Ads
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, హీరో, కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో గత కొద్దిరోజులుగా అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నేడు అనగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు.
దీంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో సినిమాలలో ఎన్నో క్యారెక్టర్లలో నటించి బహుముఖ ప్రజ్ఞశాలిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రమోహన్ ఇక లేరు అన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పటికే ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు సెలబ్రిటీలు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.. కాగా చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్ర శేఖర్. ఆయన వంద రెండు వందలు కాదు ఏకంగా 932 పైగా చిత్రాల్లో నటించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. దాదాపుగా 70- 150 చిత్రాల్లో హీరోగా నటించారు. మిగిలిన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. కాగా ఆయన అంత్యక్రియలు సోమవారం రోజు జరిగనున్నాయి.
Ads
అయితే చంద్రబాబు మోహన్ కేవలం విలక్షణ నటుడు మాత్రమే కాదు లక్కీ హ్యాండ్ అన్న విషయం కూడా చాలామందికి తెలియదు ఒకప్పటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా తొలి సినిమా ఆయనతోనే చేసింది. పదహారేళ్ల వయస్సులో వీళ్లిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఒక శ్రీదేవి మాత్రమే కాకుండా జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయ శాంతి వంటి ఎంతో మంది నటీమణులు ఆయనతో చేశాకే స్టార్ హీరోయిన్లు అయ్యారు. అంతేకాదూ చిత్ర పరిశ్రమలో ఎవరైనా నిర్మాతగా రాణించాలంటే మొదట చంద్రమోహన్‌తో సినిమా చేసేవారు.
తక్కువ బడ్జెట్‌లో సినిమాలు పూర్తి చేయడమే కాకుండా చెప్పిన సమయానికి షూటింగ్ కు వచ్చిన నిర్మాతల హీరోగా మారారు. మినిమం గ్యారెంటీ హీరోతో పాటు ఆయన చేత్తో డబ్బులు తీసుకున్నా, ఇచ్చినా అదృష్ట కలిసి వస్తుందని బలంగా విశ్వసించేవారు. అందుకు ఉదాహరణ ఇప్పుడు బడా నిర్మాతగా వెలుగొందుతున్న అశ్వినీ దత్. ఆయన ప్రొడ్యూసర్‌గా తొలి చిత్రం “ఒక సీత కథ”లో హీరో చంద్రమోహనే. ఏడిద నాగేశ్వరరావు మొదటి చిత్రం “సిరిసిరి మువ్వ” హీరో కూడా ఈ లక్కీమ్యానే.
అందుకే ఆయనతో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపించేవారు దర్శక నిర్మాతలు. రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చంద్ర మోహన్. అందుకే ఆయన హీరో కాకపోయినా.. నిర్మాతలు సినిమా తీస్తున్నారంటే ఆయన దగ్గరనుండి రూపాయి తీసుకునేవారట. అలా తీసుకుంటే లక్ కలిసి వస్తుందని నమ్మేవారట.