“చిరంజీవి” కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న “చంద్రమోహన్”…ఏ సినిమాకి తెలుసా.?

Ads

టాలీవుడ్ నటుడు, ఆల్ రౌండర్ చంద్రమోహన్ తాజాగా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రమోహన్ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా ఎంతోమంది హీరోయిన్లకు కెరియర్ ఇచ్చారు చంద్రమోహన్. అలాగే చంద్రమోహన్ కెరియర్ మొదట్లో హీరోగా రాణించారు. ఆ తరం హీరోలతో పాటు చిరంజీవి వెంకటేష్ అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి ఈ తరం హీరోల సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

Ads

ఇలా రెండు తరాల హీరోలను కవర్ చేస్తూ సినిమాలలో నటించి మెప్పించారు. ఇది ఇలా ఉంటే తాజాగా చంద్రమోహన్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఒక సినిమాలో హీరో చిరంజీవి కంటే అత్యధికంగా చంద్రమోహన్ పారితోషికాన్ని అందుకున్నారట. వినడానికి షాకింగ్ గా ఉన్నా కూడా ఇది నిజం. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అన్న వివరాల్లోకి వెళితే.. అయితే ఇదే విషయాన్ని గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా చంద్రమోహన్ మాట్లాడుతూ.. చిరంజీవి, నేను మొదటి సారి ప్రాణం ఖరీదు సినిమాలో కలిసి నటించాము. ఆ సమయంలో చిరంజీవికి ఐదు వేలు పారితోషికం ఇస్తే నాకు 25 వేల రూపాయలు ఇచ్చారు.

అంటే చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ ని నేను అందుకున్నాను. అప్పట్లో చిరంజీవి చాలా రఫ్ గా ఉండేవారు. చిరు లో ఉన్న తపన సిన్సియారిటిని చూసి ఇండస్ట్రీలో ఒక మంచి డాన్సర్ వచ్చారని అందులో అనుకున్నారు. చిరంజీవి విజయానికి ప్రధాన కారణం అల్లు అరవింద్‌. చిరంజీవి ఏ పాత్రలు చేయాలి? ఎంత రెమ్యునరేషన్‌ తీసుకోవాలి? వంటి చాలా విషయాలను ఆయన దగ్గరుండి చెప్తూ తన కెరీర్‌కు దిక్సూచిలా నిలబడ్డారు అని చంద్రమోహన్‌ చెప్పుకొచ్చారు. కాగా నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్న విషయం తెలిసిందే.

Previous articleసస్పెన్స్ మాములుగా లేదుగా.? సైలెంట్ గా ఓటీటీ లో హిట్ కొట్టేసిన ఈ సినిమా చూసారా.?
Next articleWORLD CUP 2023: ఇండియా vs న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ లో వర్షం పడితే ఏం జరగనుంది?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.