“చంద్రముఖి”లో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సీరియల్ లో.!

Ads

రజనీకాంత్ నయనతార జ్యోతిక ప్రధాన పాత్రలలో 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ చిత్రం అప్పట్లో అందర్నీ చాలా భయపెట్టింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం టీవీలలో టెలికాస్ట్ అవుతుందంటే అందరూ టీవీల వద్దే కూర్చుంటారు. రజనీకాంత్ స్టైలిష్ యాక్షన్ జ్యోతిక నటన హైలెట్ గా నిలిచాయి. మళ్లీ చంద్రముఖిని దాటిన చిత్రం రాలేదంటే విశేషం. తాజాగా చంద్రముఖి 2 వచ్చిన కూడా అది అంతగా ఆకట్టుకోలేదు.

అయితే చంద్రముఖి సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది. ఈ సినిమాలో అత్తిందొం పాట చాలా ఫేమస్. ఈ పాటలో నటించిన చిన్నారి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముద్దుగా బొద్దుగా రజనీకాంత్ తో పాటు పాటలో అలరించింది ఈ పాప పేరు ప్రహర్షిత శ్రీనివాస్.

Ads

చంద్రముఖి సినిమా తర్వాత బాలనటిగా తమిళంలో ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసింది. తర్వాత కొద్ది రోజులుకి నటనకు దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్నారి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అప్పట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఆ చిన్నారిని ఇప్పుడు మరింత అందంగా మారడంతో షాకవుతున్నారు నెటిజన్స్.

18 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు బుల్లితెరపై ఓ సీరియల్లో నటిస్తుంది. ఆమెకు 2021లోనే వివాహం జరిగింది.2022లో ఓ పాపకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ తన భర్తతో, కూతురితో దిగిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె షేర్ చేసే ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇక గతంలో ప్రహర్షిత షేర్ చేసిన వీడియో ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతుంది.

ALSO READ : ‘దృశ్యం’ మూవీలో నటించిన వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?

Previous articleషూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోయిన.. పవన్ కళ్యాణ్ 7 సినిమాలేమిటో తెలుసా.?
Next articleభార్యాభర్తలు పిల్లల్ని కనే ముందు.. తప్పక 4 ఈ విషయాలని చూసుకోవాలి..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.