Ads
దేశ రాజధాని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ ఎస్ సంధూ ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంటుంది. ఈ తరహా ఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అదేమిటంటే ఈసారి ఎన్నికలలో మాజీ, దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.
వారంతా వేరువేరు పార్టీల తరఫున పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.అయితే ఆ పిల్లలు ఎవరు? ఏ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం.ముందుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఈయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల నుంచి రేసులో నిలిచారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్ షర్మిల కూడా ఈసారి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. అయితే ఎక్కడినుంచి పోటీ చేస్తారు అనేది ఇంకా ఖరారు కాలేదు.
Ads
తెదేపా వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిల్లలు నందమూరి బాలకృష్ణ శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భాజాపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారు.
ఇక మరొక మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థిగా గుంటూరు జిల్లాలోని తెనాలి నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు సూర్య ప్రకాశ్ రెడ్డి నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక మరొక మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధన రెడ్డి కుమారుడు రామ్ కుమార్ తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.