Ads
ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. కొందరు ఈ పండుగను కాముని పున్నమి అంటారు. పెద్దలు కూడా పిల్లల్లా మారి జరుపుకునే పండగ ఇది. పిల్లలు ఈ పండుగ కోసం చాలా ఇష్టంగా ఎదురుచూస్తారు.
హొలీ రోజున అందరు తమ ఫ్రెండ్స్ పై రంగులు పులుముతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ పండగలో కెమికల్ గులాల్ పొడి వాడకం, వాటర్ బెలూన్లు, వాటర్ గన్స్ వంటివి ముఖ్యంగా వాడుతుంటారు. అయితే హొలీ వేడుకలో పిల్లలు రంగులు చల్లేటప్పుడు వారు సురక్షితంగా ఉండేలా తల్లిదండ్రులకు నిపుణులు కొన్ని సూచనలు చెప్తున్నారు. అయితే పిల్లలు సంతోషకరమైన, సురక్షితంగా ఈ పండుగను జరుపుకోవడం కోసం పిల్లల సంరక్షణ గురించి కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం..
Ads
1. సహజ రంగుల వినియోగం:
సింథటిక్ కలర్స్ హానికరమైన కెమికల్స్ ని కలిగి ఉంటాయి. ఆ రంగులు చర్మాన్ని పై పడితే దద్దుర్లు, అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్-ఫ్రెండ్లీ సహజ రంగులు మృదువుగా ఉండటమే కాకుండా ఈజీగా తొలగించుకోవచ్చు.
2.నీటి బుడగలు:
నీటితో నిండిన రంగు రంగుల బెలూన్లతో ఆడుకోవడం పిల్లలకు చాలా సరదాగా ఉంటాయి. అయితే అవి ఒక్కోసారి వారికి ప్రమాదకరంగా మారవచ్చు. ఈ నీటి బెలూన్ కళ్ళు వంటి సున్నితమైన భాగాలను తాకినట్లయితే కంటి చూపుకి ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల నీటి బెలూన్లతో పిల్లలు ఆడు కునేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
3.వాటర్ గన్:
హొలీ పండుగ ఎంజాయ్ చేయడంలో వాటర్ గన్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి. వీటితో రంగులను జల్లుకోవడం అంటే పిల్లలు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. కానీ వాటర్ గన్ తో ముఖం, నోటిపై లేదా చెవుల పై రంగులు జల్లుకోవడం ప్రమాదకరం. ఆ విషయం పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి.
4.పిల్లలను సిద్ధం చేయండి:
సింథటిక్ రంగులతో పిల్లలు ఆడుకున్నట్లయితే వార్కి హాని కలగకుండా ఉండేందుకు కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజ్ అలాగే శరీరం అంతా కవర్ అయ్యేలా దుస్తులను వేయండి. అలాగే రసాయనాల నుండి నుంచి పిల్లల్ని సురక్షితంగా ఉంచేందుకు జుట్టుకు, మొత్తం శరీరానికి కూడా నూనెను రాయండి.
5.పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోండి:
ఇక పిల్లలు హోలీ ఆడేటప్పుడు వారితో తల్లిదండ్రులు ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వారు రంగులు చల్లుకునేప్పుడు అనుకోకుండా ఆ రంగులు కళ్ళలో కానీ, చెవుల్లో కానీ పడవచ్చు. కొన్ని రంగుల వల్ల అంటు వ్యాధులకు కూడా కారణం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి హొలీ ఆడే సమయంలో తల్లి దండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: రోడ్డు మీద కనిపించే ఇలాంటి వాటిని పొరపాటున కూడా దాటకూడదు..