Ads
నేటి తరం జంటలని చూస్తుంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఏ విషయానికి ఎలా స్పందించాలో తెలియక, సలహా ఇచ్చే పెద్దలు ఇంట్లో లేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటన ఒకటి హైదరాబాదులో జరిగింది.
కేవలం చట్నీ విషయం గా జరిగిన గొడవ కోసం తన ప్రాణాలని బలి తీసుకుంది ఒక ఇల్లాలు. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన.
కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోప తండాకు చెందిన రమణ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్ళపాడు కు చెందిన భానోతు చందనను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ బంజర హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ఇందిరా నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్గా పనిచేస్తుండగా చందన ఒక
నగల దుకాణంలో పనిచేస్తుంది.
Ads
ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో అన్నంలో చట్నీ ఎక్కువ వేసేశావు అంటూ భార్యతో రమణ గొడవ పడినట్లు తెలుస్తుంది. సోమవారం సాయంత్రం రమణ డ్యూటీ కి వెళ్ళిపోయాడు. తర్వాత భార్య చందన రమణకి చాలా సార్లు వీడియో కాల్ చేసింది కానీ రమణ స్పందించలేదు. దాంతో ఫోన్ కాల్ చేసి తను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఒకసారి వెళ్లి చూడమని చెప్పాడు.
ఆ యజమాని చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో ఇంటి తలుపులు తెరిచాడు. అయితే చందన అప్పటికే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రమణని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏది ఏమైనా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలని బలి పెట్టుకోవడం అనేది విచారించదగిన విషయం