Ads
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మృత్యువు నోట్లో తలపెట్టిన లీడర్. దశాబ్దాల నుండి చేసిన పోరాటాల తరువాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తొమ్మిదేళ్ల నుండి విజయవంతంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
అయితే కేసీఆర్ తనకు చిన్నప్పుడే వివాహం అయిందని ఎన్నో సార్లు వెల్లడించారు. కానీ ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. కేసీఆర్ పెళ్లి ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సీఎం కేసీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 1954లో ఫిబ్రవరి 17న సిద్ధిపేట మండలంలోని చింతమడకలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ జన్మించారు. 1969లో కేసీఆర్ టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. ఆ సమయంలోనే కేసీఆర్ వివాహం జరిగింది. 1969 ఏప్రిల్ 23న కేసీఆర్ శోభల వివాహం జరిగింది. శోభ తండ్రి పేరు కె. కేశవరావు, ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు. కేసీఆర్ పై కేశవరావు ప్రభావం పడిందని చెబుతుంటారు.
Ads
కేసీఆర్ వయసు పెళ్లినాటికి 15 సంవత్సరాలు మాత్రమే. ఆరోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవీ. అదే రోజు జోగునపల్లి రవీందర్ రావు పెళ్లి కూడా జరిగింది. అతని భార్య శశికళ, కేసీఆర్ భార్య శోభ ఇద్దరు అక్కాచెల్లెలు. వీరిద్దరిది పెళ్లి ఒకే రోజు జరిగినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ పెళ్లి జరిగి దాదాపు 54 సంవత్సరాల అవుతోంది. కేసీఆర్ పెళ్లి రోజున రాజ్యసభ మెంబర్ జోగినిపల్లి సంతోష్ కుమార్ తన తల్లిదండ్రుల పెళ్లి ఫోటోతో పాటుగా, కేసీఆర్ పెళ్లి నాటి ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇది ఇలా ఉంటే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణలో ఎలెక్షన్స్ హడావుడి ప్రారంభం అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. తాజాగా సిద్దిపేట సభలో ప్రసంగించారు. మూడవసారి కూడా తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు.
Also Read: జగన్ లాంటి సీఎం మాకూ కావాలంటున్న తమిళనాడు ప్రజలు..! ఎందుకో తెలుసా.?