టూత్ పేస్ట్ ట్యూబుల మీద ఈ రంగు బాక్సులు ఎందుకు ఉంటాయి..?

Ads

ప్రతి రోజు మనం పళ్ళు తోముకోవడానికి టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే టూత్ పేస్ట్ బయట చూస్తే రంగు రంగుల చారలు కనబడుతూ ఉంటాయి. టూత్ పేస్ట్ మీద మాత్రమే కాదు. ఫేస్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ వంటి వాటి ట్యూబ్ ల మీద మనకి కలర్స్ కనబడుతూ ఉంటాయి.

ఇవి సహజంగా నలుపు రంగు, నీలం రంగు, ఎరుపు రంగు, ఆకు పచ్చ రంగులో ఉంటూ ఉంటాయి. అయితే ఎందుకు ఇవి వేస్తారు..? డిజైన్ కోసమా అందంగా కనపడటం కోసమా అనుకుంటే పొరపాటు.

ఎలా ఈ రంగులు సహాయ పడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. మామూలుగా టూత్ పేస్ట్ లని మెడిసిన్స్, సహజ పదార్థాలని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ రంగులని బట్టీ మనం టూత్ పేస్ట్ ని ఎలా తయారు చేసారు..? ఏం వేశారు అనేది చెప్పలేము. మనం ఏ పదార్ధాలని వాడారు అనేది కేవలం టూత్ పేస్ట్ ట్యూబ్ మీద రాసి ఉంటుంది కదా అలానే తెలుసుకోగలము. అంతే కానీ ట్యూబ్ మీద వుండే కలర్ ని బట్టీ కాదు.

అయితే మరి ఇక ఆ కలర్స్ దీన్ని సూచిస్తాయి..? ఎందుకు ఆ రంగులు ఉంటాయి..? ఈ విషయానికి వస్తే.. పేస్ట్ ట్యూబ్ మీద ఆకుపచ్చ రంగు బాక్స్ కనుక వుంటే అది న్యాచురల్. అదే పేస్ట్ ట్యూబ్ మీద నీలం ఉంటే న్యాచురల్ మరియు మెడికేటెడ్. ఒకవేళ కనుక ఎరుపు రంగు ఉంటే న్యాచురల్ మరియు కెమికల్ కాంపోజిషన్ కలిగి ఆ పేస్ట్ ఉందని అంటారు. ఒకవేళ కనుక బ్లాక్ కలర్ వుంది అంటే మొత్తం కెమికల్స్ తో నిండి ఉందని చెబుతూ ఉంటారు.

Ads

ఇది మాత్రం నిజం కాదు. ఇది అబద్దం. ఆ బాక్సులకి ఎలాంటి అర్థం కూడా లేదు. ప్యాకింగ్ చేసేటప్పుడు పేస్టులు లైట్ సెన్సార్ కలిగిన నుండి రోల్ అవుతూ వెళ్లాలి. ఆ లైట్ సెన్సార్ రంగు బాక్సుల్ని డిటెక్ట్ చేసి కట్ చేసి ఫోల్డ్ చేస్తుంది. ఆ తరవాత టూత్ పేస్ట్లను సీల్ చేయడం జరుగుతుంది. పేస్టుల తయారీలో ఇది భాగమే కానీ ఆ కలర్ బాక్సులకి అర్ధం అయితే ఏమి లేదు. చాలా మంది ఈ రంగులని చూసి పేస్ట్ లో వుండే కాంపోనెంట్స్ ఆధారంగా ఆ రంగుల బాక్సుల్ని వేస్తారు అని అనుకుంటారు. కానీ అదేమీ కాదు. కేవలం అపోహే.

 

Previous articleతారకరత్నను కాపాడడం కోసం శ్రమించిన హెల్త్ మినిస్టర్ కు కృతజ్ఞతలు చెప్తున్న అభిమానులు..
Next articleహీరోల‌కు సూప‌ర్ స్టార్‌, మెగాస్టార్ బిరుదులు ఎలా వచ్చాయంటే…?