Ads
మన ఇండియన్స్ సైకాలజీ ఏంటంటే ఎవడైనా సరే బాగా పని చేస్తున్నా, బాగా ఆడుతున్న బాగా పాడుతున్న ఈడు మా వాడు రా బాబు అని తెగ పొగిడేస్తూ ఉంటారు… అదే వాడు కొంచెం అటు ఇటుగా పెర్ఫార్మ్ చేసిన, ఫెయిల్ అయిన నేను ముందే చెప్పాను వీడి వల్ల కాదు అని తేలిగ్గా అనేస్తారు. మనవాళ్ళకి అట్లు తిప్పడం బాగా వచ్చు. ఎటు అనుకూలంగా ఉంటే అది తిప్పేస్తూ మాట మార్చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇదే పని ఒక ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విషయంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో వరల్డ్ కప్ ఫీవర్ బాగా ఉంది. ఎంతలా ఉందంటే వరల్డ్ కప్ కారణంగా సినిమాలే వాయిదా పడిపోతున్నాయి. అలాంటి వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ అంత సూపర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది.
ఆడిన ఏడు మ్యాచ్ లలో ప్రతి మ్యాచ్ నెగ్గేసింది.
అయితే మొన్నటి వరకు ఒక ప్లేయర్ నీ ఇష్టం వచ్చినట్టు ఇండియన్ అభిమానులు, క్రికెట్ అభిమానులు ట్రోల్ చేసేసారు. అతడు ఎవరో కాదు శ్రేయస్ అయ్యర్. పాపం ఈ బ్యాటర్ మొదట మ్యాచ్ నుండి వరుస పెట్టి షాట్ బాల్ కి అవుట్ అయిపోయేవాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ గాని, న్యూజిలాండ్ మ్యాచ్ గాని ఒకే విధంగా ఆడి అవుట్ అయ్యాడు. మొన్న ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా ఇలాగే అవుట్ అయితే ఇంటర్నెట్ లో ఇతన్ని ఒక్క రేంజ్ లో ట్రోల్ చేశారు.శ్రేయస్ అయ్యర్ షార్ట్ గా ఉండే అమ్మాయిలతో డేటింగ్ చేయడేమో అంటూ ఎటకారంగా పోస్టులు పెట్టారు.
Ads
అయితే ఎవరూ ఊహించిన విధంగా నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 56 బాల్స్ లో 82 కొట్టి తన ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పుడు ట్రోల్ చేయండి అన్నట్టు ట్రోలర్స్ కి ఒక సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ట్రోలర్స్ కొత్త పాట పాడుతున్నారు. మొన్న మనమందరం ట్రోల్ చేయడం వల్లే నిన్న బాగా ఆడాడు అంటూ కామెంట్స్ చేస్తూ కవర్ చేసుకుంటున్నారు.
ఏదో వీరందరూ దగ్గరుండి శ్రేయస్ అయ్యరు బ్యాట్ పట్టుకుని ఆడించినట్టు చెబుతున్నారు పాపం. ఎంతైనా మన ఇండియన్స్ సైకాలజీ వేరయ్య.ఏదైతే ఎంటి శ్రేయస్ అయ్యర్ ఫామ్ లోకి వచ్చాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తూ సెమీఫైనల్స్ ఫైనల్స్ కి వెళ్లి ఇండియాకి కప్పు తీసుకురావాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.
Also Read:ఆఫ్ఘనిస్తాన్ విజయాల వెనుక ఒక ఇండియన్ ఉన్నాడా..? ఎవరంటే..?