“ఇది డెడికేషన్ కాదు..!” అంటూ… “శ్రీలీల” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

Ads

శ్రీ లీల అంటే ఈమధ్య తెలియని వారెవరు లేరు. అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ కన్నడ భామ తెలుగు లో నెలకు ఒక సినిమా చేస్తూ మంచి బిజీగా ఉంది.

ధమాకా సినిమా లో రవితేజ సరసన నటించిన అందరి దగ్గర మంచి గుర్తింపుని తెచ్చుకొని అప్పటినుంచి మంచి జోరు మీద కొనసాగుతుంది ఈమె కెరీర్. కానీ వరుసగా స్కంద, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ వంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

మరి వచ్చే పండగ కి విడుదల అయ్యే గుంటూరు కారం ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. మధ్యలో బాలయ్యతో నటించిన భగవంత్ కేసరి సినిమా బాగానే ఆడినా కూడా గుంటూరు కారంలో ఈమె నటన ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీలీల ఎం.బీ.బీ.ఎస్ చివరి సంవత్సరం చదువుతుంది. ఈ పరీక్షలు పాస్ అయితే తను డాక్టర్ అయిపోయినట్టే.

Ads

సినిమా సినిమాకి మధ్య పది రోజులు గ్యాప్ తీసుకుంటూ చదువుకొని పరీక్షలు రాస్తూ ఉండేది. కానీ ఈమధ్య పరీక్షలను సైతం పక్కన పెట్టి సినిమా ప్రమోషన్లకు వస్తుందట. గుంటూరు కారం ప్రమోషన్లకి కూడా అలాగే చేస్తుందట. ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా సప్లిమెంటరీలో రాసి పాస్ అవుతానులే అని అవి పక్కన పెట్టి మరీ ప్రమోషన్స్ చేస్తుండట. దీని మీద నెటిజన్లు రియాక్ట్ అవుతూ సినిమాల కోసం చదువుని వదిలేసుకోవడానికి కారణం డబ్బు పైన మోజా? లేకపోతే డెడికేషనా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా పండగ కి గుంటూరు కారం సినిమా విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. అందులో మహేష్ బాబుతో శ్రీ లీల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఆసక్తి చూపిస్తున్నారు శ్రీ లీల ఫ్యాన్స్. మరి ఈ శ్రీలీల అందరిని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Previous articleఅర్థం కాలేదా..? “సలార్” సినిమాపై గీతూ రాయల్ రివ్యూ చూసారా..? ఏం అన్నారంటే..?
Next article2024 లో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న హీరోయిన్స్ వీరే..! లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.