Ads
షార్ట్ ఫిలిమ్స్ లో, ఆ తర్వాత చాలా సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి, బేబీ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టారు వైష్ణవి చైతన్య. ఇప్పుడు లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో సినిమా బృందం పాల్గొని సినిమా గురించి మాట్లాడారు. అయితే, వైష్ణవి చైతన్య యాస మీద కామెంట్స్ వస్తున్నాయి.
వైష్ణవి చైతన్య గతంలో నటించిన షార్ట్ ఫిలిమ్స్ లో ఆంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడేవారు. భాష మామూలుగానే ఉండేది. బేబీ సినిమా ప్రమోషన్స్ సమయంలో వైష్ణవి చైతన్య భాషలో మార్పు అందరూ గమనించారు. వైష్ణవి చైతన్య తనని తాను పక్కా తెలంగాణ పిల్ల అని చెప్పుకుంటారు. చిన్నప్పటినుండి పాతబస్తీలోనే పెరిగాను అని చెప్తారు. కానీ వైష్ణవి చైతన్య మాట్లాడే తెలంగాణ భాష చూస్తే సహజంగా అనిపించదు అంటూ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు. బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య మాట్లాడే ప్రతి ఇంటర్వ్యూలో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి.
Ads
అయితే ఇప్పుడు వైష్ణవి చైతన్య లవ్ మీ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు, ఒక విలేకరి రుద్రమదేవి సినిమాలోని, “నేను తెలుగు భాష లెక్క. ఆడ ఉంటా. ఈడ ఉంటా” అనే డైలాగ్ ని ఆంధ్ర స్లాంగ్ లో చెప్పమని అడిగారు. వైష్ణవి చైతన్య ఈ భాష మాట్లాడడానికి కష్టపడ్డారు. ఆంధ్ర అంటే అదేదో వేరే భాష కాదు. కానీ వైష్ణవి చైతన్య అది చెప్పలేకపోయారు. భాష అనే పదాన్ని కూడా సరిగ్గా పలక లేకపోయారు. దాంతో ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా, “భాష వచ్చు కదా. రానట్టు మాట్లాడుతున్నారు ఏంటి” అని అంటున్నారు. అసలు ఆంధ్ర భాష తెలియనట్టు మాట్లాడుతున్నారు అంటూ ఈ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.
#Vaishnavi tries to speak in Andhra slang for a Telangana-accented dialogue from #RudrammaDevi. pic.twitter.com/bURoZmiVDj
— Gulte (@GulteOfficial) May 16, 2024