Ads
కీలక పదవుల్లో బాధ్యత నిర్వహించే వ్యక్తులు మాట్లాడే మాటలు ఎక్కువ ప్రభావం ఉంటుదనే విషయం తెలిసిందే. వారి మాటలను ప్రజలు చాలా ఆసక్తిగా వింటారు. అయితే ఆ మాటల్లో ఏవైనా పొరపాట్లు దొర్లితే పలు రకాలుగా మాట్లాడుకుంటారు.
ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో అలాంటివి క్షణాల్లో వైరల్ గా మారుతాయి. వాటి పై జరిగే చర్చ అంతా ఇంతా కాదు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ కు ఎదురయ్యింది. ఆయన కామెంట్స్ పై నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతోంది. అది కరెక్టే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మిచౌంగ్ తుపాన్ కారణంగా అతలాకుతలం అయిన ప్రాంతాల్లో శుక్రవారం నాడు సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వాకాడు మండలంలోని బాలిరెడ్డిపల్లెలోని వరద బాధితులతో ఏర్పరిచిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ఏరియాలలో 92 రిలీఫ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎనిమిది వేలకు పైగా బాధితులను తరలించామని వెల్లడించారు. అరవై వేల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని తెలిపారు.
Ads
25 కిలోల బియ్యం, పామాయిల్, కందిపప్పు, కిలో ఉల్లిగడ్డ, బంగాళాదుంపలు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలా మాట్లాడే క్రమంలో పొటాటోను ఉల్లిగడ్డ అంటారు కదా అంటే, అక్కడున్న వారు బంగాళదుంప అని చెప్పడంతో, నవ్వుకుంటూ ‘ఆ.. బంగాళాదుంప’ అని అన్నారు. దాంతో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు. అయితే ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు కూడా తేడా తెలియని ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన రాయలసీమవారు మాత్రం సీఎం జగన్ అన్నది కరక్టే. రాయలసీమలో బంగాళదుంపని ఊళ్లగడ్డ అంటారని కామెంట్స్ చేస్తున్నారు.
I am not a supporter of Jagan but in the rayalseema region we call it like that. https://t.co/flFNDZZ765
— Pramoda (@iampramoda) December 8, 2023
Also Read: 2000 గురించి చెప్పమంటే.. 2047 అంటారు.. ఆయన్ని నమ్మగలమా..?