Ads
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన దర్శకుడు మత్రమే కాకుండా ప్రొడ్యూసర్, రచయిత.
Ads
పూరీ జగన్నాథ్ వ్యక్తిత్వాన్ని ఆయన తెరకెక్కించే చిత్రాలే ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చు. ఆయన సమాజాన్ని చూసే కోణాన్ని ఆయన సినిమాలు ఆవిష్కరిస్తాయి. అందువల్లే ఆయన తెరకెక్కించే సినిమాలలోని క్యారెక్టర్స్ మాటలు కూడా ఆడియెన్స్ కి కొంచెం కొత్తగాను, వింతగాను అనిపిస్తుంటాయి. సొసైటీలోని కొన్ని సమస్యలపై పూరీ జగన్నాథ్ ఇచ్చే వివరణ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా బద్రి. ఈ సినిమాలో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పూరీ జగన్నాథ్ కి దర్శకత్వంలో వరుసగా సినిమాలు వచ్చాయి. అంతకు ముందు ఎలాంటి ఇమేజ్ ఉన్న హీరో అయినప్పటికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించిన తరువాత వారికి మాస్ ఇమేజ్ ఏర్పడుతుంది. హీరోలని కొత్తగానూ, విభిన్నంగా ప్రజెంట్ చేయడంలో పూరీ శైలే వేరుగా ఉంటుంది.
ఆయన సినిమాలలోని హీరోల మ్యానరిజం అలాగే ఆడియెన్స్ మైండ్ లో ప్రింట్ అవుతుంది. అంతలా ఆయన అప్పటివరకు చూడని సరికొత్తదైన మ్యానరిజంతో మూవీని తీస్తారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి, శివమణి, ఇడియట్, పోకిరి,టెంపర్, బిజినెస్ మేన్ లాంటి సినిమాలలో అందులోని హీరోల మ్యానరిజం సినిమాలు రీలజ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంటుంది.అయితే గత ఏడాది భారీ అంచనాల మధ్యన విడుదలైన లైగర్ సినిమా అపజయంతో పూరీ జగన్నాథ్ కాస్త నిరాశపడ్డారు. పూరీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులలో ఉన్నారని సమాచారం. ఇది ఇలా ఉండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వం చేసిన సినిమాలలో నటించిన హీరోలకు ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది ఏమిటంటే ఆయన తెరకెక్కించే సినిమాల్లో హీరో క్యారెక్టర్ అనాధగా చూపిస్తాడు. అతనికి సత్రమైన ఇల్లుకాని, కుటుంబం కానీ ఉండవు. దాదాపు చాలా సినిమాల్లోనూ హీరో పాత్ర అలానే ఉంటుంది. ఇక ఇదే విషయం పై సోషల్ మీడియాలో మీమ్స్ షికారు చేస్తున్నాయి.
Also Read: టాలీవుడ్ లో త్రిపాత్రాభినయం చేసిన 9 మంది హీరోలు వీరే..