Ads
అనుకున్నవి నెరవేరాలని చాలా మంది దేవుడిని పూజించి కోరికలని నెరవేర్చమని కోరుకుంటూ ఉంటారు. మనసులో కోరికల్ని దేవుడికి చెప్పి ఆ పని మీద దృష్టి పెడుతూ ఉంటారు. నిజానికి మీరు అనుకున్న కోరికలు తీరాలంటే దైవాన్ని ఇలా కోరుకోండి.
ఇలా కనుక మీరు కోరుకుంటే కచ్చితంగా మీరు అనుకున్నవి నెరవేరుతాయి. మరి దైవాన్ని ఎలా కోరుకోవాలి..? ఎలా కోరుకుంటే నెరవేరుతాయి అనే విషయాలను చూసేద్దాం.
#1. మా ఇంట్లో ఎప్పుడూ కూడా దైవానికి నిత్యం నైవేద్యం ఉండాలి. ప్రతి రోజు నైవేద్యం ఉండేటట్టు చూడు స్వామి అని మీరు కనుక భగవంతుడిని కోరుకుంటే అప్పుడు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఆహారం ఉంటుంది.
#2. ఇంట్లో ప్రతిరోజు కూడా పూజ చేయాలి అని కోరుకోవాలి. ఇలా కోరుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది ఆనందంగా మీరు ఉండడానికి అవుతుంది.
#3. ఎప్పుడూ కూడా మా ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి అని మీరు భగవంతుడిని కోరుకుంటే.. కచ్చితంగా జీవితాంతం మీరు ఆనందంగా ఉండడానికి అవుతుంది.
Ads
#4. ఇంట్లో అందరూ కూడా ఆనందంగా క్షేత్ర దర్శనానికి రావాలి అని దేవుడిని కోరుకోవాలి. ఆర్థికంగా ఆరోగ్యంగా అప్పుడు మీరు ఉండగలరు. అలానే అన్యోన్యంగా కూడా మీరందరూ కలిసి ఉండగలరు.
గడప నిండుగా ఉండాలని భగవంతుని కోరుకోండి. అప్పుడు సమాజంలో తగిన గౌరవం మీకు ఉంటుంది. మంచి పేరు కూడా వస్తుంది.
#5. నేను ఆఖరి దశ లో ఉన్నంతవరకు నీ వద్దకు రావాలి అని భగవంతుడిని కోరుకోండి. అంటే అప్పుడు మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించేందుకు కుదురుతుంది.
#6. బతికి ఉన్నంత వరకు కూడా ధార్మిక కార్యాలు నీవు ఇచ్చే సంపాదనతో చేయాలి అని కోరుకోండి. అంటే ఎప్పుడు సంపాదన మీకు ఉంటుంది. ఇలా కనుక మీరు భగవంతుడిని కోరుకుంటే కచ్చితంగా కోరిక నెరవేరుతుంది.