Ads
మన ఇండియన్ క్రికెట్ టీం లో ఉన్న చాలా మంది ఆటగాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే ఆటగాళ్లలో ఎవరికీ ఎక్కువ ర్యాంకింగ్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇండియన్ క్రికెట్ టీం లో ఎనిమిది మంది ఆటగాళ్లకి హై ర్యాంకింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి.
#1. హర్భజన్ సింగ్, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ పంజాబ్:
హర్భజన్ సింగ్ ఒక మంచి స్పిన్నర్. చాలా ఆటలు ఆడాడు. పంజాబ్ పోలీసులు డిప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ పంజాబ్ ని అందుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీం లో ఆయన చేసిన సేవలకి గాను ఈ రివార్డ్ లభించింది.
#2. జోగిందర్ శర్మ:
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వారి డిపార్ట్మెంట్ లో ఈ ఉద్యోగాన్ని జోగిందర్ శర్మ కి ఇచ్చారు.
#3. కపిల్ దేవ్, లాయుటెనెంట్ కల్నల్, ఇండియన్ ఆర్మీ:
ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియన్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్. 2008 లో లాయుటెనెంట్ కల్నల్ గా ఎంపిక అయ్యారు.
Ads
#4. ఉమేష్ యాదవ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ మేనేజర్:
నాగ్‌పూర్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉమేష్ యాదవ్ 2007 లో అపాయింట్ అయ్యాడు.
#5. మహేంద్ర సింగ్ ధోని, లాయుటెనెంట్ కల్నల్, ఇండియన్ ఆర్మీ:
లాయుటెనెంట్ కల్నల్ గా ఎంపిక అయ్యారు మహేంద్ర సింగ్ ధోని కూడా.
#6. K.L రాహుల్, అసిస్టెంట్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
మంచి టాలెంటెడ్ ఆటగాడు కెఎల్ రాహుల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపిక అయ్యాడు.
#7. యుజ్వేంద్ర చాహల్, ఇన్‌స్పెక్టర్, ఆదాయపు పన్ను శాఖ:
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్‌స్పెక్టర్ పోస్టు కి ఎంపిక అయ్యాడు యుజ్వేంద్ర చాహల్.
#8.సచిన్ టెండూల్కర్, IAF హోనోరారి గ్రూప్ కెప్టెన్:
సచిన్ టెండూల్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ గొప్ప ఆటగాడు IAF హోనోరారి గ్రూప్ కెప్టెన్ కింద నియమితులయ్యారు.