Ads
చాలా మందికి క్రికెట్ ఆట ఆడటం అంటే ఎంతో ఇష్టం. అలానే క్రికెట్ ఆట ని చూడడం అంటే కూడా చాలా మందికి ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు ఇలా వివిధ రకాలుగా మ్యాచ్లని నిర్వహిస్తూ ఉంటారు. క్రికెట్ ఆటను చూస్తూ ఉంటే మనకి సమయమే తెలియదు.
పైగా ఐపీఎల్ వంటి మ్యాచ్లకి అయితే ఆఖరి బంతి వరకు కూడా మనకి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా…?
బౌలర్లు బౌలింగ్ చేసినప్పుడు స్పీడ్ ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు అని… చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే వెంటనే క్లియర్ చేసుకోండి. బౌండరీ బయట ఒక పెద్ద బ్లాక్ బోర్డ్ లాంటిది ఉంటుంది. ఆ బ్లాక్ బోర్డ్ ని ఆటగాడి యొక్క బౌలింగ్ స్పీడ్ ని తెలుసుకోవడానికి వాడుతూ ఉంటారు. 1947 వ సంవత్సరంలో జాన్ బేకర్ అనే ఒక ఆయన బౌలింగ్ స్పీడ్ ని తెలుసుకునే టెక్నిక్ ని కనుక్కోవడం జరిగింది. ఇది డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా పని చేస్తుంది అయితే క్రికెట్లో మాత్రం దీనిని 1999లో మొదలుపెట్టారు.
Ads
అప్పటి నుండి బౌలర్ యొక్క బౌలింగ్ స్పీడ్ ని దీని ద్వారా కాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇక ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూస్తే.. ఇందులో ట్రాన్స్మిటర్ రిసీవర్ రెండు ఉంటాయి. రేడియో వేవ్స్ ని ట్రాన్స్ఫర్ చేసి మళ్లీ రిసీవ్ చేసుకుని ఆ ప్లేయర్ యొక్క బౌలింగ్ స్పీడ్ లెక్కిస్తుంది. అయితే ఇది కేవలం ఇన్స్టంట్ స్పీడ్ ని మాత్రమే లెక్కపెట్టగలదు. ఆ బాల్ తాలూకా స్పీడ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే.. ప్లేయర్ తన చేతితో బాల్ ని విసురుతున్నప్పుడు మాత్రమే.
ఆ బాల్ స్పీడ్ కేవలం అప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. అంతేకానీ చేయ జారిన తర్వాత ఎంత వేగంగా బాల్ వెళ్తుంది అనేది తెలుసుకోలేరు. ఆ తర్వాత హాక్ ఐ టెక్నాలజీ వచ్చింది. హాక్ ఐ టెక్నాలజీ ద్వారా బాల్ స్పీడ్ ని లెక్కపెట్టొచ్చు. ఇలా ఈ రెండు టెక్నిక్స్ ని ఉపయోగించి బౌలర్ యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు.