Ads
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు.త్వరలో మిగతా గ్యారెంటీలు కూడా ఇవ్వాలని ప్రయత్నిస్తుంది.అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించింది.
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్దమైంది. గృహజ్యోతి పథకం కింద ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేసింది. దాన్ని త్వరలోనే అమలు చేయనుంది.
అయితే ఈ గృహజ్యోతి పథకం కోసం ప్రజాపాలనలో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం అమలుపై నెల ఆఖరు లోపు మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే గృహజ్యోతి పథకం వస్తుందని భావించి ఈనెల విద్యుత్తు బిల్లులు ఎవరూ చెల్లించలేదట. దీంతో విద్యుత్ బకాయిలు కోట్ల రూపాయల లో పేరుకుపోయాయని అంటున్నారు. గృహ జ్యోతి పథకం అమలు కావాలంటే ముందుగా విద్యుత్ బిల్లు చెల్లిస్తేనే ఇచ్చేలా ప్రభుత్వం భావిస్తోంది.
Ads
విద్యుత్ బకాయిలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 6000 కోట్ల వరకు ఉన్నాయట.గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకున్న వారికి ఈ పథకం అమలు చేయాలంటే పెండింగ్ కరెంట్ బిల్స్ క్లియర్ చేయకపోతే కష్టమేనని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా సంక్రాంతిలోపు ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మరో పథకాన్ని అమలు చేయాలని భావించింది. అయితే గత ప్రభుత్వంలో పేరుకుపోయిన అప్పుల కారణంగానే పథకాల అమలు జాప్యం జరుగుతోందని తెలిపింది. గృహజ్యోతి కూడా పెండింగ్ కరెంట్ బిల్స్ చెల్లింపులు క్లియర్ అయితేనే మొదలవుతుందని సమాచారం ఉంది. కాబట్టి విద్యుత్ బకాయిలు పెండింగ్ ఉన్న ప్రజలందరూ ముందుగా విద్యుత్ బకాయిలు చెల్లిస్తేనే గృహ జ్యోతి పథకానికి అర్హులవుతారు