Ads
నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే మరొక సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా పేరు డియర్. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆనంద్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అర్జున్ (జీవీ ప్రకాష్ కుమార్) ఒక పెద్ద న్యూస్ రీడర్ అయ్యి, జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలి అని కలలు కంటూ ఉంటాడు.
అర్జున్ కి చిన్న శబ్దాలకి కూడా నిద్ర మెలకువ వస్తుంది. దీపిక (ఐశ్వర్య రాజేష్) కి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఇలాంటి కాన్సెప్ట్ ఇటీవల గుడ్ నైట్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా దగ్గర దగ్గర అదే సినిమా కాన్సెప్ట్ లాగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి సినిమా కాన్సెప్ట్ మారిపోతుంది. ఇద్దరు పెద్ద వాళ్ళని కలపడమే సినిమా కాన్సెప్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో అలా ఎందుకు అయ్యింది అనేది మాత్రం అర్థం కాదు.
Ads
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. ఐశ్వర్య రాజేష్ కి మాత్రం మరొక ఛాలెంజింగ్ పాత్ర దొరికింది. చాలా బాగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ ముందుకు తీసుకెళ్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన కొన్ని రోజులకి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో లవ్ స్టోరీ తో పాటు మిగిలిన ఎమోషన్స్ కూడా ఉన్నాయి.
ALSO READ : 15 ఏళ్ల క్రితం లవర్ గా…ఇప్పుడు అదే హీరోకి తల్లిగా నటించనున్న “ప్రియమణి”.! ఎవరంటే.?