వీళ్లకి ఆదాయాలు మాత్రమే కాదు… అప్పులు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి..! అంబానీకి ఉన్న అప్పు ఎంతంటే..?

Ads

భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ నడుపుతూ లక్షల కోట్లు ఆర్జిస్తున్నాడు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికులలో ఒకరిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ముఖేష్ అంబానీ.

ఆయన ఎంత లగ్జరీస్ లైఫ్ ని గడుపుతారో మనందరికీ తెలిసిందే.. అయితే లక్షల కోట్లు సంపాదించే అంబానీకి అప్పులు ఉన్నాయి అంటే చాలా వరకు చాలామంది నమ్మరు. మీరు నమ్మిన నమ్మకపోయిన అంబానీ అప్పుల్లో కూడా అగ్రగామిగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

debts of these indian businessmen

మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 3.13 లక్షల కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ప్రధమ స్థానంలో ఉన్నట్లు సమాచారం. దేశంలోని పెద్ద విద్యుత్ రంగ కంపెనీలలో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రూ. 2.20 లక్షల కోట్ల అప్పుతో ఈ జాబితాలో రెండవ స్థానంలో చేరింది.

debts of these indian businessmen

Ads

వోడాఫోన్ ఐడియా అప్పుల గురించి గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని అప్పు రిలయన్స్ కంటే తక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ అప్పు మాత్రం రూ. 2.01 లక్షల కోట్లని సమాచారం. భారతి ఎయిర్‌టెల్ కూడా దేశంలో ఎక్కువ అప్పు తీసుకున్న కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ మొత్తం అప్పు రూ.1.65 లక్షల కోట్లని తెలుస్తోంది.

debts of these indian businessmen

దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) రూ.1.40 లక్షల కోట్ల అప్పులను, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రూ.1.29 లక్షల కోట్ల అప్పుతో ఈ జాబితాలో చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (PGCIL) అప్పు రూ. 1.26 లక్షల కోట్లు కాగా, దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ అప్పుడు రూ. 1.25 లక్షల కోట్ల వరకు ఉందని స్పష్టమవుతోంది.

debts of these indian businessmen

చంద్రయాన్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన లార్సెన్ అండ్ టుబ్రో సంస్థ మొత్తం అప్పు రూ.1.18 లక్షల కోట్లు. లక్ష కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుత అప్పు రూ.1.01 లక్షల కోట్లు. అయితే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్ లేకపోవడం గమనార్హం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోట్లలో సంపాదిస్తున్న ముఖేష్ అంబానీ అప్పు చేయడం అన్నది నెటిజన్స్ ని ఆశ్చర్య పరుస్తోంది.

ALSO READ : TS ELECTIONS 2023 :తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 5 మంది యువ నారీమణులు ఎవరో తెలుసా.?

Previous article“రామ్ చరణ్-లియో” కేమియో వార్త లాగానే… ప్రేక్షకులని మోసం చేసిన 8 హీరోల “గెస్ట్ రోల్” వార్తలు..!
Next article49 ఏళ్ళ విజయ్ కి బాబాయిగా 41 ఏళ్ళ స్టార్ హీరోని ఎలా తీసుకుందాం అనుకున్నారు..? ఎవరంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.