Ads
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్‌తో అంచనాలను పెంచిన ఈ మూవీ నేడు (డిసెంబర్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటిసారి స్పై థ్రిల్లర్ స్టోరీలో నటించారు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- మూవీ: డెవిల్ – ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్
- నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సత్య, సంయుక్త మీనన్.
- దర్శకత్వం: అభిషేక్ నామా
- నిర్మాతలు: అభిషేక్ నామా
- సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
- రిలీజ్ డేట్: 2023-12-29
స్టోరీ:
బ్రిటిష్ వారి కాలంలో ఒక రాజు ఫ్యామిలిలో ఓ అమ్మాయి అనుమానస్పదంగా చనిపోతుంది. ఆమె మరణించడానికి కారణం తెలియదు. దాంతో ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఏజంట్ డెవిల్(కళ్యాణ్ రామ్) వస్తాడు. రాజా కుటుంబం ఉండే ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ డెవిల్ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో నమ్మలేని చెదిరే నిజాలు బయటకు వస్తాయి.
అమ్మాయి చావుకి, బ్రిటిష్ సీక్రెట్ మిషిన్ కి సంబంధం ఉందని తెలుస్తుంది. డెవిల్ పైన అక్కడివారికి సందేహం వస్తుంది. ఇక అధికారులు డెవిల్ తో ఆపరేషన్ టైగర్ హంట్ ని ప్రారంభిస్తారు. నైషధ (సంయుక్త మీనన్) అదే ఊరికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి ఎఎలా చనిపోయింది? ఆమెకు, బ్రిటిషర్స్ సీక్రెట్ మిషిన్ కి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి? డెవిల్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
Ads
బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ని అమిగోస్ నిరాశపరిచింది. తాజాగా డెవిల్ మూవీతో కళ్యాణ్ రామ్ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి ముందు నవీన్ మేడారం దర్శకత్వం చేశారు. కానీ ఆ తరువాత అతను తప్పుకోవడంతో నిర్మాత అభిషేక్ నామ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నార్మల్ గా సాగినా, ద్వితీయార్ధంలో కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ ని చాలా ఆకట్టుకుంటాయి. మూవీకి సంగీతం కూడా హెల్ప్ అయిందని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకే. విజువల్ గా ఈ మూవీని సినిమాటో గ్రాఫర్ అద్భుతంగా చూపించారు.
నటీనటుల విషయానికి వస్తే, కళ్యాణ్ రామ్ మరొకసారి మంచి పాత్రలో నటించడమే కాకుండా, ఒదిగిపోయి నటించాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ ఎప్పటిలానే ఆకట్టుకుంది. మిగిలిన ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ లు బాగున్నాయి. అందరూ తమ పాత్ర మేరకు సెటిల్ గా నటించి ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
- కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ నటన,
- విజువల్స్,
స్టోరీ పాయింట్, - నిర్మాణ విలువలు,
- సినిమాటోగ్రఫీ,
మైనస్ పాయింట్స్:
- వీక్ స్క్రీన్ ప్లే
- కొన్ని బోరింగ్ సీన్స్
రేటింగ్ :
2.75 / 5
చివరి మాట:
స్టోరీ పరంగా బాగున్నా, బలహీనపైన స్క్రీన్ ప్లే తో సాగుతుంది. అయితే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. సినీ లవర్స్, స్పై థ్రిల్లర్ ఇష్టపడేవారికి నచ్చుతుంది.
watch trailer: