తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి న్యూ టాలెంట్‌ను ప‌రిచ‌యం చేస్తూ దూసుకెళ్తోన్న ‘ఢీ’

Ads

 

సరికొత్త డాన్సింగ్ టాలెంట్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ టాలెంటెడ్ షో ఢీ. ఈ షోకు వ‌స్తున్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెరపై ఢీ షో క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతీ సీజన్‌కి ఓ కొత్త థీమ్, కొత్త యాంకర్లతో బరిలోకి దిగుతూ ఎప్పటికప్పుడు ఢీ షోకి ఉన్న రూపు రేఖలు మార్చేస్తున్నారు. 2009లో ప్రారంభ‌మైన ఈ డాన్స్ షో ప్ర‌స్తుతం 18వ సీజ‌న్‌తో ప్రేక్ష‌కుల‌ను రంజింపు చేస్తోంది. అలాగే ఢీ షో.. ద‌క్షిణాదిలోనే టీవీ రంగంలో టాప్ షోగా పాపులారిటీని సంపాదించుకుని జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Ads

డాన్స్‌ల‌ను అమితంగా ప్రేమించే అభిమానుల‌కు ఢీ షో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త టాలెంట్‌ను ప‌రిచ‌యం చేస్తూ అందరి మ‌న‌సుల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకుంది. 15కి పైగా కొరియోగ్రాఫ‌ర్స్‌ను తెలుగు చిత్ర సీమ‌కు అందించి త‌న‌దైన చెర‌గ‌ని ముద్ర వేసింది ఢీ షో.

Previous article30కిపైగా సింగ‌ర్స్ టాలీవుడ్‌కు పరిచ‌యం చేసిన వ‌న్ అండ్ ఓన్లీ షో ‘పాడుతా తీయగా’
Next articleదసరా స్పెషల్ ఈవెంట్.. భక్తి, వినోదంలో హైలెట్స్ ఇవే
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.