Ads
దర్శకులలో ప్రస్తుతం ఎక్కువగా వినిస్తున్న దర్శకుడు పేరు లోకేష్ కనగరాజ్ అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తీసిన ఐదు చిత్రాలతోనే కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారాడు.
లోకేష్ తాను తీసే చిత్రాల్లో ఒక మూవీతో ఇంకో మూవీకి లింక్ చేస్తూ ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) ను సృష్టించి ఆడియెన్స్ లో అంచనాలను అమాంతం పెంచేశాడు. అయితే ఎల్సీయూలోని అన్నీ పాత్రలను హీరో సూర్య 2009 లోనే చూపించేసాడని ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో తెరకెక్కించిన లియో మూవీ విజయం సాధించాడు. ఈ 3 చిత్రాలు ఎల్సీయూల్లో భాగంగా తెరకెక్కాయి. తర్వాత వచ్చే చిత్రాలు ఇందులో భాగం కానున్నాయని చెప్పి రాబోయే చిత్రాల పై లోకేష్ ఇప్పటి నుండే అంచనాలు పెంచేసాడు. అయితే ఎల్సీయూలోని పాత్రలన్ని సూర్య 2009లో నటించిన మూవీలో చూపించాడనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
తమిళ స్టార్ సూర్య హీరోగా 2009లో కెవి ఆనంద్ దర్శకత్వంలో ‘అయాన్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తెలుగులో ‘వీడోక్కడే’ టైటిల్ తో విడుదల అయ్యింది. రెండుచోట్ల కూడా ఈ మూవీ విజయం సాధించింది. ఇక ఈ మూవీ స్టోరీ కూడా మాదకద్రవ్యాలను అమ్మేవారిని పట్టుకోవడం, వాటిని నాశనం చేయడం ఉంటుంది. లోకేష్ చిత్రాలలో మాదకద్రవ్యాలను నాశనం చేయడమే మెయిన్ పాయింట్.
వీడోక్కడే మూవీలో దాస్ అండ్ కో, పార్తీబన్, ఢిల్లీ అనే పేర్లు ఉన్న పాత్రలు ఉంటాయి. ఈ పేర్లతో ఉన్న పాత్రలు లోకేష్ చిత్రాలలో కూడా కనిపిస్తాయి. వీడోక్కడేలో సూర్య మాదకద్రవ్యాలను పట్టుకుందేనందుకు పోలీసులకు హెల్ప్ చేస్తుంటాడు. ఇక విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో సూర్య డ్రగ్స్ డీలర్ గా ఎంట్రీ ఇస్తాడు. వీడోక్కడే మూవీని, ఎల్సీయూకి లింకు చేస్తూ ఎడిట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: 50 ఏళ్ల నటి “రజిత” పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?