Ads
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయనకు క్లాస్ ఆడియెన్స్ తో పాటు మాస్ ఆడియెన్స్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు నటన, లుక్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి దానిలో పరిపూర్ణంగా ఉండే యాక్టర్. అయితే తన ప్రతి చిత్రంలో నటనతో, డైలాగ్స్‌తో ఆడియెన్స్ ని అలరించే ఈ సూపర్ స్టార్‌కి తెలుగు చదవడం కానీ, రాయడం కానీ అసలు రాదు.
Ads
తెలుగు డైలాగులను చాలా సులువుగా చెప్పే మహేష్ కి తెలుగులో చదవడం, రాయడం రాదని స్వయంగా ఆయనే చెప్పారు. మరి తెలుగు రానపుడు మహేశ్ బాబు తెలుగు డైలాగ్స్ ని ఎలా నేర్చుకుంటాడా అని ఆశ్చర్యపోతున్నారా? మహేష్ బాబుకి చిన్నతనం నుండే మెమరీ ఎక్కువగా ఉంది. దాంతో సూపర్ స్టార్ దర్శకుల మాటల్ని బాగా గుర్తు చేసుకొని డైలాగ్స్ చెబుతారంట. అయితే మహేష్ కి తెలుగు రాకపోయినా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటాడు.
ఇక ఈ విషయన్ని మూవి ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆశ్చర్య పోయే విషయాలను తెలిపారు. తనకు తెలుగు చదవడం కానీ, రాయడం కానీ రాదని చెప్పారు. డైరెక్టర్స్ చెప్పినపుడు విన్న డైలాగ్స్ ను చెబుతానని మహేష్ చెప్పు కొచ్చారు. అయితే మహేశ్ బాబు తెలుగుకు రాకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన స్కూలింగ్ చెన్నైలో జరిగింది.
అక్కడే కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తీ, విజయ్ మహేష్ కి స్నేహితులు అయ్యారు. ఇదే విషయన్ని డైరెక్టర్ కొరటాల శివ కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మహేష్ బాబు మెమొరీ కిల్లర్ మెమొరీ. 2 సార్లు డైలాగ్ వింటే మహేష్ బాబుకు ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చారు. వీరి కాంబోలో శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు వచ్చాయి.
మహేష్ ప్రస్తుతం SSMB28 పేరుతో డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడు. మహేష్, త్రివిక్రమ్‌ల కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ మూవీ పూర్తి అయిన తరువాత మహేష్ రాజమౌళితో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు.Also Read: బాలయ్య చెప్పిన ”కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ను ఎవరి దగ్గర నుండి కాపీ చేశారంటే..