గత 16 సంవత్సరాలలో వరల్డ్ కప్ లో ఆ జట్టు పై ఇంగ్లండ్ ఒక్కసారి కూడా నెగ్గలేదు తెలుసా..?

Ads

ఐసీసీ ప్రపంచకప్‌ 2023 టోర్నీకి ముందు సెమీ ఫైనల్‌ లో చోటు పొందే జట్ల విషయంలో పలువురు మాజీ క్రికెటర్లు జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి.

ఈ టోర్నీలోకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టు ఈ టోర్నీ నుండి నిష్క్రమించే మొదటి జట్టుగా మారింది. గురువారం నాడు శ్రీలంక చేతిలో ఇంగ్లండ్ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో సెమీస్ కు వెళ్ళే ఛాన్స్ కు దాదాపు అయ్యింది. ఆ వివరాలు ఇప్పడు చూద్దాం..
గత ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ జట్టు పోరాడి, ప్రపంచకప్‌ను సాధించి, ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రేసులోకి దిగింది. కానీ లీగ్‌ స్టేజ్ లోనే డేంజర్ లో పడింది. గత ప్రపంచ ఛాంపియన్‌ జట్టు ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్కదానిలో మాత్రమే గెలిచింది. మిగిలిన 4 మ్యాచ్ లు వరుసగా గెలిచినా కూడా సెమీస్ రేసులో నిలవడం అసాధ్యంగా కనిపిస్తోంది. గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ కి దిగిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 25.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులతో విజయం సాధించింది. దీనితో శ్రీలంక ఈ టోర్నీలో రెండవ విజయాన్ని నమోదు చేసింది. అయితే ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక చేతిలో ఓడిపోవడం ఇంగ్లండ్ కు ఇది కొత్త కాదు. గత 16 సంవత్సరాలుగా  వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ ఒక్కసారి కూడా శ్రీలంక జట్టు పై గెలుపు సాధించలేదు.
ప్రపంచకప్‌ 2007లో ప్రారంభం అయిన ఇంగ్లండ్‌ పరాజయలు ప్రపంచకప్‌ 2023 వరకు కొనసాగాయి. 2007 టోర్నీలో ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో శ్రీలంక రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఆ తరువాత 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2015 ప్రపంచకప్‌లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ పై విజయాన్ని సాధించింది. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ పై  ఇరవై పరుగుల తేడాతో గెలిచింది. ఇక ప్రపంచకప్‌ 2023లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ పై గెలుపు సాధించింది.

Ads

Also Read: పాకిస్తాన్ గెలవాలంటే టీం లోకి అతన్ని తీసుకొని రావాల్సిందే అంట.. అయినా ఇప్పుడు లాభమేముంది..?

Previous articleవరుణ్-లావణ్య పెళ్లి శుభలేఖలో ఇది గమనించారా.? వారి పేర్లను ముందుగా ముద్రించి..!
Next articleReview: కంచెరపాలెం ఫేమ్ కార్తీక్ నటించిన “లింగోచ్చా” సినిమా ఎలా ఉంది..? అసలు లింగోచ్చా అంటే ఏంటి..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.