Ads
కొంత మంది నటులు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఉండి మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంటారు. కొంత మంది ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఉండి మంచి పాత్రలు చేస్తారు. కొంత మంది నటులు చివరి రోజుల వరకు కూడా నటిస్తూనే ఉంటారు. అలాంటి నటులు తమ పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. వారు లేకపోయినా కూడా వారి సినిమాల ద్వారా వారు గుర్తుంటారు. ప్రేక్షకులు వాళ్ళ గొప్పతనాన్ని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు.
అందుకే వాళ్ళందరినీ గొప్ప నటులు అని అంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే కాదు. వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ల గురించి మంచిగా మాట్లాడుకుంటారు. పైన ఫోటోలో ఉన్న నటి ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చెల్లెలిగా, అక్కగా, ఆ తర్వాత అమ్మమ్మగా, బామ్మగా కూడా నటించారు. సీనియర్ నటి రాధా కుమారి గారు తెలియని వారు ఉండరు. 1942 లో విజయనగరంలో రాధా కుమారి గారు పుట్టారు. 1964 లో వచ్చిన వివాహ బంధం సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. పైన ఉన్న ఫోటో పూలరంగడు సినిమాలోది.
Ads
ఈ సినిమాలో రాధా కుమారి గారు పోషించిన పాత్రకి చాలా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 1996 లో శ్రీకృష్ణార్జున విజయం సినిమాలో నటించిన రాధా కుమారి గారు, మధ్యలో కొన్ని సంవత్సరాలు బ్రేక్ తీసుకొని, 2002 లో నువ్వు లేక నేను లేను సినిమాలో హీరో బామ్మగా నటించారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు, ధన 51, సైనికుడు, మీ శ్రేయోభిలాషి, చందమామ, కింగ్, ఆర్య 2, బ్రహ్మిగాడి కథ, నువ్విలా సినిమాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. బామ్మ, అమ్మమ్మ పాత్రలు ఉంటే రాధా కుమారి గారు గుర్తుకు వచ్చేవారు. అంత బాగా నటించేవారు.
2012 లో ఎర్ర గులాబీలు అనే సినిమాలో చివరిగా రాధా కుమారి గారు నటించారు. మార్చి 8వ తేదీ, 2012 లో 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాధా కుమారి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రాధా కుమారి గారు సినిమాల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఉన్నారు. రాధా కుమారి గారి భర్త రావి కొండలరావు గారు కూడా మంచి నటులు. ఎన్నో సినిమాల్లో నటించారు. 2012 లోనే రావికొండల రావు గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వీరిద్దరికీ శశి కుమార్ అనే కొడుకు ఉన్నారు. ఈ కాలం వారికి రాధా కుమారి గారు తెలిసే అవకాశం తక్కువ. కానీ రాధా కుమారి గారి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఆమె ఎంత గొప్ప నటి అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఉంటారు.