అంత స్టార్ హీరో అయ్యుండి.. “వెంకటేష్” ఇలాంటి ఫోన్ వాడుతున్నారా..?

Ads

దీపావళి పండుగను టాలీవుడ్ సెలబ్రెటీలు చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. బాలీవుడ్ లో 3 రోజుల ముందుగా దీపావళి పార్టీలు మొదలయ్యాయి. టాలీవుడ్ రామ్ చరణ్, ఉపాసన జంట తమ నివాసంలో దీపావళి పార్టీని సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.

శనివారం రోజు జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల కుటుంబాలు, సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వెంకటేష్ వాడుతున్న మొబైల్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్లీంకార రాకతో మెగా ఫ్యామిలిలో సంబరాలు ఆకాశన్నంటుతున్నాయి. క్లీంకారతో తొలి దీపావళి పండుగ కావడంతో రామ్ చరణ్ ఉపాసనలు దీపావళి పార్టీని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఈ వేడుకకు తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు తమ కుటుంబాలతో హాజరు అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సెలెబ్రేషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత, యంగ్ టైగర్ ఎన్టీఆర్,ప్రణతి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి వచ్చారు.
అక్కినేని నాగార్జున ఫ్యామిలీ, చైతూ, అఖిల్ అందరూ వచ్చారు. విక్టరీ వెంకటేష్, మంచు మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ వంటి వారు పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. వెంకటేష్, రామ్ చరణ్,మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఉన్న ఫోటో మరియు వెంకటేష్, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో వెంకటేష్ చేతిలో ఉన్న ఫోన్ పై నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ ఫోన్ ఉన్న ఫోన్ పగిలినట్టుగా కనిపిస్తోంది. సెలబ్రెటీలు పగిలిన ఫోన్లను ఉపయోగించరు. కొత్త ఫోన్ కొనుగోలు చేస్తారు. అలాంటిది పెద్ద హీరో అయిన వెంకటేష్ పగిలిపోయిన ఫోన్ వాడుతూ ఉండడంతో  వెంకటేష్ కి సింప్లిసిటీకి నెటిజెన్లు ఫిదా అయ్యి, కామెంట్స్ చేస్తున్నారు.

Ads

Also Read: ఎలాంటి చెడు అలవాట్లు లేవు…కానీ రూ.100 కోట్ల ఆస్తిని “చంద్రమోహన్” ఎలా పోగొట్టుకున్నారు.?

Previous articleఎలాంటి చెడు అలవాట్లు లేవు…కానీ రూ.100 కోట్ల ఆస్తిని “చంద్రమోహన్” ఎలా పోగొట్టుకున్నారు.?
Next articleఈ విషయంలో రష్మీ, అనసూయ కంటే “సిరి హనుమంత్” చాలా బెటర్ అంటున్న నెటిజెన్స్..ఏంటంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.