గుంటూరు కారం ట్రైలర్‌లో ఈ విషయం గమనించారా..? దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..?

Ads

మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద అమాంతం పంచనాలను పెంచింది. ఈ సినిమాలో ఆద్యంతం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో నిండిపోయింది. మహేష్ బాబు కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు. ఇదివరకు సినిమాల్లో చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ చేసే మహేష్ ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా డాన్స్ లు,డైలాగ్ డెలివరీతో చెలరేగిపోయారు.

మరోపక్క శ్రీ లీలా అందం కూడా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. మీనాక్షి చౌదరి కూడా చాలా అందంగా కనిపించింది. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ఈ సినిమాల్లో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మదర్ సెంటిమెంట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే గుంటూరు కారం నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో మహేష్ బాబు తన ఎడమ కంటిని సగం మూసి కనిపించినట్లుగా ఉన్నారు.

changes in guntur kaaram

Ads

పలు షాట్లలో కళ్ళకి చేతిని పెట్టుకుని ఏదో టార్గెట్ చేసి చూసినట్లుగా కూడా చూపించారు. అయితే ఇదంతా సీన్ లో భాగమని అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన ట్రైలర్ లో ఒక విషయం స్పష్టమైనది. మహేష్ బాబు చిన్నప్పుడు ఒక నిప్పు రవ్వ వచ్చి కంటిని తాకినట్టు చూపించారు. దాంతో కంపేర్ చేసి చూస్తే ఆ నిప్పురవ్వ తాకింది ఎడమ కంటిలో… తర్వాత సీన్లలో మహేష్ చాలా చోట్ల ఎడమ కన్ను మూసి కనిపించారు.

did you observe this in guntur kaaram trailer

దీనిపైన నెటిజన్ లు ఎనాలసిస్ మొదలుపెట్టారు. చిన్నప్పుడు మహేష్ కంటిలో నిప్పురవ్వ పడుతుందని దాని మూలంగా కన్ను సరిగ్గా కనబడదని అందువలన కన్ను సగం మూసి కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీనికి చాలామంది మద్దతు కూడా చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రూమర్ బాగా వైరల్ అవుతుంది. అయితే ఇది నిజమా కాదా అని తెలియాలంటే జనవరి 12 వరకు వేచి చూడాలి. ఇదే గనక నిజమైతే ఒక డిఫరెంట్ మహేష్ ని మనం చూడవచ్చు

Previous article90’s వెబ్ సిరీస్ లో శివాజీ పెద్ద కొడుకుగా నటించిన ఈ అబ్బాయి గురించి తెలుసా..? ఇతను ఎవరంటే..?
Next articleగుంటూరు కారం ట్రైలర్‌లో రమ్యకృష్ణకి ప్రశ్న వేసిన ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.