Ads
ప్రస్తుతం ఎక్కువ శాతం రాళ్ల ఉప్పు కాకుండా మామూలు ఉప్పును ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండిటికి ఉన్న తేడా ఎక్కువమందికి తెలియదు. టీవీల్లో ప్యాకెట్ సాల్ట్ మంచిది అంటూ ఇచ్చే ప్రకటనల కారణంగా కూడా ఎక్కువగా వాడుతున్నారు.
రాళ్ళ ఉప్పు ముతకగా ఉంటుంది. కరగడానికి టైమ్ పడుతుంది. కానీ ప్యాకెట్ సాల్ట్ త్వరగా కరిగిపోతుందని కూడా దీనినే ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు రాళ్ల ఉప్పు మంచిదని సూచిస్తున్నారు. ఈ రెండింటిలో ఏ ఉప్పు మంచిది అనేది ఇప్పుడు చూద్దాం..
ప్యాకెట్ సాల్ట్ మెషీన్ లో శుద్ధి చేస్తారు. ఈ సాల్ట్ కి సోడియం, క్లోరైడ్, అయెడిన్ తో పాటు అందంగా కనిపించేట్టు ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలుపుతారని తెలుస్తోంది. ఇలా తయారుచేసిన సాల్ట్ వాడడం వల్ల గాయిటర్, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్పు వల్లనే అధిక రక్తపోటు వస్తున్నట్టు తెలిపారు. ఉప్పులో 97 శాతం సోడియం క్లోరైడ్, 3 శాతం ఇతర మూలకాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Ads
రాళ్ల ఉప్పు సముద్రం లేదా ఉప్పునీటి సరస్సుల నుండి తయారు చేస్తారు. రాళ్ల ఉప్పు దాదాపు 85 శాతం సోడియం క్లోరైడ్, 15 శాతం ఇనుము, జింక్, రాగి, అయోడిన్, మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం మొదలైనవాటితో పాటు దాదాపు ఎనబై నాలుగు రకాల మూలకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి చేస్తాయి. దీనిలో అయోడిన్‌ని కలిపే అవసరం ఉండదు. అయితే ప్యాకెట్ సాల్ట్ లో అయోడిన్ ని కలపాల్సిన అవసరం ఉంటుంది.
రాళ్ల ఉప్పు వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా రకాల ఖనిజాలను ఉండటం వల్ల, అనేక జబ్బులు నివారించడంలో పని చేస్తుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ ఉప్పు సైనస్ ట్రీట్మెంట్ లో సాయపడుతుంది. సరైన మోతాదులో రాళ్ల ఉప్పు వాడితే అధిక బరువు సమస్యను నివారిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ ఉప్పును ఫుడ్ లో చేర్చుకుంటే మంచిది. మైగ్రేన్ పెయిన్ కు కారణం అయ్యే మెగ్నీషియం లోపాన్ని ఈ ఉప్పు భర్తీ చేస్తుంది. అంతేకాకుండా మలబద్ధక సమస్యని నివారించి జీర్ణ సంబంధిత చర్యలను మెరుగుపరుస్తుంది.
Also Read: మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ అక్కడ పెడుతున్నారా? అయితే మీ ప్రాణానికే ప్రమాదం తెలుసా?