Ads
చాణక్య చెప్పినట్లుగా మనం ఆచరిస్తే జీవితంలో ఎటువంటి ఇబ్బంది అయినా సరే తొలగిపోతుంది. నిజానికి చాణక్య మన జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి చాలా చక్కగా చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మనం చాణక్య చెప్పిన వాటిని ఆచరిస్తే సులభంగా వాటి నుండి బయటపడొచ్చు. పైగా చాణక్య ఎంతటి మహా జ్ఞానో మనకి తెలిసిన విషయమే.
మంచి రచయితగా సలహాదారునుగా కూడా గొప్ప పేరు పొందారు. చాణక్య స్నేహితుల గురించి భార్యాభర్తల గురించి ఇలా ఎన్నో విషయాలని చెప్పారు వాటిని కనుక ఆచరిస్తే జీవితంలో గెలుపొందొచ్చు.
బాధల నుంచి బయటపడొచ్చు. అయితే మనకి ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండకూడదు అసంతృప్తి లేకుండా ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరు అనుకుంటాము. కానీ చాణక్యమాత్రం ఈ విషయాల్లో అసంతృప్తి ఉండడం మంచిదని అంటున్నారు. మరి ఎటువంటి విషయాల్లో అసంతృప్తి ఉన్నా కూడా మంచిదే అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Ads
#1. దేవుడిని పూజించడం:
మనం దేవుడికి చేసే పూజలలో దేవుడిని స్మరించే విషయంలో అసంతృప్తి ఉంటే కూడా మంచిదే ఈ విషయంలో మనకి అసంతృప్తి ఉంటే భగవంతుడిని మరింత పూజించడానికి అవుతుంది.
#2. దానం చేయడం:
దానం విషయంలో కూడా మనిషికి అసంతృప్తి ఉన్నా మంచిదే మనిషికి దానం విషయంలో అసంతృప్తి ఉంటే ఇంకాస్త దానాలు చేస్తూ ఉంటారు దానితో మరింత పుణ్యం వస్తుంది అని చాణక్య నీతి ద్వారా ఆచార్య చాణక్య చెప్పారు.
#3. జ్ఞానం, విద్య:
జ్ఞానం విద్య పట్ల అసంతృప్తి ఉన్నా కూడా మంచిదే నిజానికి విద్యా జ్ఞానం వంటి వాటిలో అసంతృప్తి చాలా ముఖ్యం.