Ads
పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు అంటుంటారు. ఒకప్పుడు వివాహం చేసుకున్నవారు జీవితాంతం ఎన్ని ఇబ్బందులు ఎదురు అయిన కలిసే ఉండేవారు. అయితే కాలం మారింది. ప్రస్తుతం అలా ఉండే పరిస్థితులు లేవు.
పెళ్లి చేసుకున్నాక నచ్చకపోతే విడాకులు తీసుకుంటున్నారు. ఆ తరువాత ఎవరి జీవితంలో వాళ్లు ముందుకెళ్తున్నారు. అయితే పెద్దలు కుదిర్చిన వారిని పెళ్లి చేసుకున్నవాళ్లు చాలా వరకు కలిసి ఉంటున్నారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు మాత్రమే ఎక్కువగా డైవర్స్ తీసుకుంటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఎక్కువగా ప్రేమ పెళ్లి చేసుకున్నవారే విడిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు. మరి వారు విడిపోవడానికి గల ఆ కారణాలు ఏమిటో చూద్దాం..ఈ జంటలు ముందు చాలాకాలం ప్రేమించుకుంటారు. ఆ సమయంలో ఒకరి పై ఇంకొకరు చాలా ప్రేమను పెంచుకుంటారు. కానీ వారి పెళ్లి చేసుకున్న తరువాత ఆ ప్రేమ అలగే ఉండడం లేదని, దాంతో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నవారు ఎక్కువగా విడిపోతున్నారని అంటున్నారు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే వారిద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చినట్లయితే దాన్ని తీర్చడానికి ఇద్దరి కుంటుంబ పెద్దలు వస్తారు. ఇక ప్రేమ వివాహం చేసుకున్నవారికి ఆ అవకాశం లేకపోవడంతో వల్ల సమస్యని వారిద్దరే పరిష్కరించుకోవాలి. కానీ వారి ఆ సమస్యలని తట్టుకోలేక ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవడం వల్ల మనస్పర్ధలు పెరిగి విడిపోతున్నారని తెలిపారు.
Ads
ఇక భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు వచ్చి సర్ది చెప్పి మళ్ళీ కలపడానికి ప్రయత్నిస్తారు. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వారి మద్య గొడవలు వచ్చినపుడు వాళ్ళను కలపడానికి పెద్దలు ముందుకు రావట్లేదు. ఇక ప్రేమ పెళ్ళి చేసుకున్నవారు విడిపోవడానికి మరో కారణం అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ తరువాత అవన్నీ అబద్దాలని తెలుసుకుని విడిపోతున్నారని మానసిక నిపుణులు తెలిపారు.
Also Read: భర్తని పేరు పెట్టి ఎందుకు పిలవకూడదు..? దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా..?