Ads
సినిమాల్లో చాలా వరకు నిజ జీవితానికి దూరంగానే ఉండే సంఘటనలని చూపిస్తారు. కొన్ని మాత్రం నిజ జీవితంలో చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే విషయాలని సినిమాల్లో చూపిస్తారు. అలా ముఖ్యంగా సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద చాలా సినిమాలు వచ్చాయి.
అందులో ఒక సినిమా తాప్సి హీరోయిన్ గా నటించిన తప్పడ్ సినిమా. తప్పడ్ అంటే తెలుగులో చంప దెబ్బ అని అర్థం. ఇందులో హీరోయిన్ తన భర్త తనని చంప దెబ్బ కొట్టాడు అనే ఒకే ఒక కారణం వల్ల విడాకులు ఇస్తుంది.
“ఒక్క చెంప దెబ్బకు విడాకులు ఇవ్వడం ఏంటి?” అని అందరూ అడిగినా కూడా, “ఇంకొక రెండు, మూడు సార్లు కొట్టాక విడాకులు ఇస్తే అప్పుడు కరెక్ట్ అవుతుందా?” అని అడుగుతుంది. “ఒక్కసారి అయినా, రెండు సార్లు అయినా సరే. కొట్టే హక్కు లేదు” అని చెప్తుంది. ఇలాంటివి నిజ జీవితంలో చాలా మంది ఎదుర్కొంటారు. భర్త భార్యని కొట్టడం లాంటి విషయాలు చాలా సార్లు చూస్తూ ఉంటాం. అయితే సినిమాలో చివరికి హీరోయిన్ కి విడాకులు లభిస్తాయి.
సాధారణంగా నిజంగా ఒక వ్యక్తి ఒక్కసారి తన భాగస్వామిని కొడితే విడాకులు లభిస్తాయా? భారతదేశం చట్ట ప్రకారం ఒక చంప దెబ్బకి విడాకులు మంజూరు చేస్తారా? నిజానికి, ఒకే ఒక్క చంప దెబ్బ కారణంగా విడాకులు మాత్రం ఇవ్వడం జరగదు. ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం, ఒకవేళ అలా ఇవ్వాల్సి వచ్చినా కూడా వేధింపులు అనే విషయం కింద విడాకులు మంజూరు చేస్తారు. కొట్టడం, మాటలతో వేధించడం ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అయితే క్షణికావేశంలో కూడా చంప దెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఎంత గౌరవించినా కూడా ఒక్కొక్కసారి తెలియకుండా ఇలాంటివి జరుగుతాయి.
Ads
అలాంటప్పుడు అవతలి వ్యక్తి మీద గౌరవం ఉన్నప్పుడు వేధింపులు అనే కేసు పెట్టడం చాలా మంది ఇష్టపడరు. అలాంటి సమయంలో నో-ఫాల్ట్ డివోర్స్ తీసుకుంటారు. అంటే ఒకరితో ఒకరికి సెట్ అవ్వకపోవడంతో వాళ్ళు విడిపోవాలి అని నిర్ణయించుకున్నట్టు ఇందులో ఉంటుంది. సాధారణంగా భారతదేశ చట్ట ప్రకారం విడాకులని 3 రకాలుగా విభజిస్తారు. అందులో ఒకటి వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు. వేధింపులు అలాంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. మరొకటి మానసికంగా అనారోగ్యంగా ఉండడం లాంటి విషయాలు వల్ల వచ్చే సమస్యలు.
ఇంకొకటి పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులు. సాధారణంగా పైన చెప్పిన 3 రకాల్లో మొదటి రెండు రకాలకి విడాకులు మంజూరు చేయాలి అంటే చాలా విషయాలని నిరూపించాల్సి ఉంటుంది. సాక్షాధారాలు లేకుండా విడాకులు మంజూరు చేయడం కష్టం. ఎందుకంటే అందులో అవతల వ్యక్తి గురించి ఒక విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులు మాత్రం ఆలోచించి ఇరు వర్గాల వారు నిర్ణయించుకొని చేస్తారు కాబట్టి విడాకులు మంజూరు చేస్తారు.
ALSO READ : రోజా సెల్వమణి “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?