Ads
ఇటీవల కాలంలో టెలివిజన్ లో, ఓటీటీలలో మరియు యూట్యూబ్ ఛానల్స్ లో నిర్వహించే టాక్ షోలకు, ఇంటర్వ్యూలకు చాలా మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. గతంలో అయితే ఎప్పుడో ఒకసారి సెలబ్రిటీల ఇంటర్వ్యూలు వస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా వాటిని చూసేవారు.
Ads
ప్రస్తుతం అయితే టాక్ షోలు చాలా మధ్యమాల్లో చాలా మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూన్నారు. మరి ఇలా టాక్ షోలకు, యూట్యూబ్ ఛానల్ లలో వచ్చే ఇంటర్వ్యూలలో పాల్గొనే వారికి పారితోషకాలు ఇస్తారా? ఒకవేళ ఇచ్చినట్లయితే గెస్ట్ గా వచ్చినవారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు? ఈ విషయం పై చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నిర్వహించడం వల్ల ఆహాకు చాలా పబ్లిసిటీ వచ్చింది.అంతే కాకుండా ముందుకంటే ఎక్కువమంది సబ్స్క్రైబర్లు పెరిగారు. ఈ షోకి వచ్చేవారంత టాప్ సెలబ్రిటీలే. మరి టాప్ సెలబ్రిటీలను షోకు రావడం వల్ల ఆ వారికి ఎంతో ఆదాయం వస్తుంది. ఇంకా ఈ టాక్ షోలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులు రావటంతో మరింత పబ్లిసిటీ చేకూరుతుంది.
సెకండ్ సీజన్ లో చంద్రబాబు నాయుడు ఈ షోకి రావడం వల్ల రాజకీయంగా ఆయనకు మరింత పబ్లిసిటీ వచ్చింది. చివరి ఎపిసోడ్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ కి కూడా అలాగే అయ్యింది. ఇక పలువురు సినీ హీరోలు ఈ షోకు హాజరు కావడం వల్ల వారు నటించిన సినిమాలకు ప్రమోషన్ గా కలిసి వస్తుంది. కాబట్టి సినీ సెలబ్రిటీలు పారితోషకం తీసుకోకుండానే ఈ షోకి హాజరు అవుతారు. అయితే చిన్న చిన్న సెలబ్రిటీలు ఇలాంటి టాక్ షోలకు హాజరు అయితే మాత్రం వారు తప్పకుండా పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది. సినిమాలలో నటించడానికి తీసుకునేంత పారితోషికం కాకుండా కొంతవరకు పారితోషికంగా చెల్లిస్తుంటారని తెలుస్తోంది.
Also Read: సింహాద్రి, అత్తారింటికి దారేది సినిమాలలోని ఈ సీన్స్ గమనించారా?