Ads
సాధారణంగా ఒక వయసుకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పెళ్లికి సంబంధించిన కలలు కనటం సహజం. అయితే కలలలో వచ్చే సంఘటనలు ఏమిటో చాలామందికి అర్థం కావు. అసలు అలాంటి కల ఎందుకు వచ్చింది అని చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు పెళ్లికి సంబంధించిన కలలు ఎందుకు వస్తాయి ఏ కలలు వస్తే మంచిది అనే విషయం చూద్దాం.జ్యోతిష్య శాస్త్రంలో వివాహం అనేది ఒక ముఖ్యమైన బంధం ఇది ఒకరి జీవితాన్ని సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
కలలో మీకు పెళ్లి జరుగుతున్నట్లు కనిపిస్తే అది చెడు సంకేతం కాదు. ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడే భాగస్వామి కోసం వెతుకుతున్నారని అర్థం. కలలో జీవిత భాగస్వామి పెళ్లి వేడుకలు ఆనందంగా కనిపిస్తే వైవాహిక జీవితంలోని ఆనందాన్ని అది సూచిస్తుంది బాధగా ఉంటే మ్యారేజ్ లైఫ్ బాధలతో నిండిపోయి ఉంటుందని అర్థం. వధువు వేషధారణలో ఉన్నప్పుడు ఆ డ్రెస్ కి చిల్లు పడినట్లు, లేదంటే మరక పడినట్లు అనిపిస్తే ఆ పెళ్లి సంతోషంగా చేసుకోవడం లేదని అర్థం, తక్కువ ఆత్మ గౌరవాన్ని కలిగి ఉన్నారని అర్థం.
Ads
ఇలాంటి కలలు వచ్చినవారు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడానికి భయాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. పెళ్లి ఆలోచన లేకపోయినప్పటికీ పెళ్లి అయినట్టు కల వచ్చిందంటే ఎవరికైనా లేదా దేనికైనా కట్టుబడి ఉండాలని కోరికను కలిగి ఉన్నారని అర్థం. నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే అదే భయానక కలత పెట్టే కల కావచ్చు ఇది ఆదర్శ భాగస్వామి గురించి ఆలోచన భావాలను ప్రభావితం చేయవచ్చు.
ప్రస్తుత ఆ వివాహంలో సమస్యలు ఉన్నప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నట్లు కలరు రావడం సాధారణమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ప్రస్తుతం సంబంధం పట్ల అసంతృప్తిగా ఉన్నారు అని దీని అర్థం. ఈ జీవితంలో ఆనందంగా లేనివారు మరొక జీవితంలో ఆనందంగా ఉండాలని భావించడం వలన అలాంటి కలలు వస్తాయి కాబట్టి ప్రస్తుత సంబంధం లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.