Ads
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. ఆయన ఇరవై మూడు రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఎన్టీరామారావు గారి ఫ్యామిలిలో ఇప్పటి వరకు చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. తారకరత్న మరణంతో ఈ విషయం పై వార్తలు వస్తున్నాయి.
Ads
ఎన్టీరామారావు, బసవతారకం లకు పన్నెండు మంది సంతానం. ఎన్టీరామారావు గారి వారసులలో కొందరు ప్రస్తుతం జీవించి లేరన్న విషయం కొంత మందికే తెలియవచ్చు. అయితే నందమూరి కుటుంబంలో అంతా సజావుగానే సాగుతోందని, అలాగే నందమూరి ఫ్యామిలీ మంచి స్థానంలో ఉందని అనుకునే సమయంలోనే ఆ ఫ్యామిలిలో ఎవరో ఒకరు కన్నుమూస్తూనే ఉన్నారు. ఇక గత కొన్నేళ్ళ నుండి అయితే నందమూరి ఫ్యామిలీలో నాలుగు సంవత్సరాలకోసారి ఎవరిదో ఒకరి మరణ వార్తలు వినాల్సివస్తోంది. ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీలో మరణించినవరెవరో ఇప్పుడు చూద్దాం..
1. ఎన్టీరామారావు పెద్ద కుమారుడు రామకృష్ణ:
ఎన్టీరామారావు గారి పెద్ద కుమారుడు రామకృష్ణకి చిన్న ఏజ్ లోనే అరుదైన జబ్బు వచ్చి అనారోగ్యంతో మరణించాడు. రామకృష్ణ చనిపోయిన సమయంలో ఎన్టీఆర్ ఇరుగు పొరుగు సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఆయన షూటింగ్ పూర్తి చేశాకే ఇంటికి వచ్చారు. అయితే పెద్ద కుమారుడు మరణించడాన్ని ఆయన జీర్ణించుకోడానికి ఎన్నో రోజులు పట్టింది. రామకృష్ణ మరణాంతరం పుట్టిన 7వ కుమారుడికి రామకృష్ణ జూనియర్ అని పేరు పెట్టారు.
2, నందమూరి జానకిరామ్:
ఎన్టీరామారావు గారి లాగానే ఆయన కుమారుడు హరికృష్ణకు పుత్రశోకం కలిగింది. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ 2014 లో రోడ్డు యాక్సిడెంట్ లో మరణించాడు. జానకి రామ్ మరణాన్ని తండ్రి హరికృష్ణ జీర్ణించుకోలేక పోయాడు.3.నందమూరి హరికృష్ణ
జానకి రామ్ మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 2018 లో హరికృష్ణ కూడా కుమారుడిలాగానే రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు.4.నందమూరి సాయి కృష్ణ
ఎన్టీరామారావు గారి కుమారుడు సాయి కృష్ణ 2004 లో కన్నుమూశారు.5,కంటమనేని ఉమా మహేశ్వరి
ఎన్టీరామారావు గారి నాలుగవ కుమార్తె కంటమనేని ఉమా మహేశ్వరి గత ఏడాది కన్నుమూశారు. ఆమె హైదరాబాద్ లోని తన ఇంటిలో ఉరివేసుకుని చనిపోయారు.
6. నందమూరి తారకరత్న
నందమూరి తారకరత్న గుండెపోటుతో హాస్పటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 18న మరణించారు.
Also Read: పవన్ కళ్యాణ్, ప్రభాస్ తండ్రి, తారక రత్నకి ఉన్న పోలిక ఏమిటో తెలుసా?