Ads
సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సీరియల్స్ కు క్రేజ్ ఏర్పడింది. ఇది ప్రతి ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. బుల్లితెర పై వచ్చే సీరియల్స్ కు ముఖ్యంగా గృహిణులు వీరాభిమనులని చెప్పవచ్చు.
Ads
ఇంట్లో ఉండే చాలామంది గృహిణులు టీవి సీరియల్స్ కే చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక వారి సీరియల్స్ సమయంలో సినిమాలు కానీ, క్రికెట్ చూస్తున్నా కూడా అవి తీసేసి మరి డైలీ సీరియల్ చూస్తుంటారు. ఇంకా చెప్పాలంటే సీరియల్స్ వల్ల కొన్ని ఇళ్ళలో గొడవలు కూడా జరుగుతాయి. అవి వచ్చే సమయంలో వేరే పని చేయరు కూడా, సీరియల్ చూసి అనారోగ్యం తెచ్చుకున్న మహిళలూ ఉన్నారు.అయితే సీరియల్స్ తీయడం కూడా ఎక్కువ బడ్జెట్ తో కూడుకున్న విషయమే. దానికి కారణం ఏమిటంటే సీరియల్స్ లో నటించే నటీమణులు వాడేవన్ని ఖరీదు అయినవే. దుస్తువులు, బంగారం, కార్లు వాడతారు. అందువల్ల సీరియల్ ప్రొడ్యూసర్స్ కి బడ్జెట్ ఎక్కువే అవుతుంది. సీరియల్స్ లో కనిపించే మహిళలు అందమైన చీరలతో, నగలతో మెరిసిపోతుంటారు. సందర్భంతో సంబంధం లేకుండా, ప్రతి సన్నివేశంలోనూ కూడా కలర్ ఫుల్ గా ఉంటారు. దానివల్ల అవి కూడా సినిమాలలాగనే కనిపిస్తూ ఉంటాయి. అయితే సీరియల్స్ లో ఆర్టిస్ట్ లు కట్టుకునే చీరలు ఎక్కడి నుండి వస్తాయి? ఆర్టిస్ట్ లు కొంటారా? యూనిట్ వాళ్ళు ఇస్తారా? ఆ తరువాత వాడిన చీరలను ఏం చేస్తారనే విషయాలు చాలా మందికి తెలియవు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.కొంత మంది నటీమణులు సీరియల్ చిత్రీకరణ సమయంలో వారి సొంత చీరలనే ఉపయోగిస్తారు. కొంతమంది ఆర్టిస్ట్ లకి సీరియల్ యూనిట్ వారే చీరలు, నగలు ఇస్తారు. అయితే సీరియల్స్ సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటాయి. దానివల్ల ఆ చీరలనే ఎవరికి సందేహం రాకుండా రెండు,మూడు నెలలకు ఒకసారి మార్చి వాటినే కడుతూ ఉంటారు. దీంతో సీరియల్ చూస్తున్న వారు గుర్తుపట్టే అవకాశం పెద్దగా ఉండదు. అంటే టీవి సీరియల్స్ లో వాడే చీరలను తిరిగి ఉపయోగిస్తారు.
Also Read: కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీలో పనిమనిషిగా నటించిన ఆమె ఎవరో తెలుసా?